Centre Bans Youtube Channels: దేశ వ్యతిరేక కంటెంట్, ఫేక్ కంటెంట్ వ్యాప్తి చేస్తున్న 8 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. నిషేధానికి గురైన ఛానెళ్లలో 7 భారతీయ ఛానెళ్లు, 'న్యూస్ కీ దునియా'అనే పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెల్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 ప్రకారం ఈ ఛానెళ్లపై నిషేధం విధించినట్లు కేంద్రం వెల్లడించింది.
నిషేధానికి గురైన ఛానెళ్ల జాబితా :
లోక్‌తంత్ర టీవీ - 12.90 లక్షల సబ్‌స్క్రైబర్స్
యు&వీటీవీ - 10.20 లక్షల సబ్‌స్క్రైబర్స్
ఏఎం రజ్వీ - 95900 సబ్‌స్క్రైబర్స్
గౌరవ్‌శాలి పవన్ మిథిలాంచల్ - 7 లక్షల సబ్‌స్క్రైబర్స్
సీటాప్5టీహెచ్- 33.50 లక్షల సబ్‌స్క్రైబర్స్
సర్కారీ అప్‌డేట్ - 80900 సబ్‌స్కైబర్స్
సబ్ కుచ్ దేకో - 19.40 లక్షల సబ్‌స్క్రైబర్స్
న్యూస్ కీ దునియా (పాకిస్తాన్) - 97 వేల సబ్‌స్కైబర్స్
నిషేధానికి గురైన యూట్యూబ్ ఛానెళ్లన్నింటికి కలిపి 85.73 లక్షల సబ్‌స్క్రైబర్స్, 114 కోట్ల వ్యూస్ ఉన్నాయి.దేశంలో మత సామరస్యానికి భంగం కలిగించేలా, మతరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా ఈ యూట్యూబ్ ఛానెళ్ల కంటెంట్ ఉన్నట్లు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ గుర్తించిది. అలాగే, ప్రజలను తప్పుదోవ పట్టించే కథనాలను వ్యాప్తిలోకి తీసుకొస్తున్నట్లు గుర్తించింది. మతపరమైన నిర్మాణాలను భారత ప్రభుత్వం కూల్చివేస్తుందంటూ, కొన్ని మతాల పండగలపై నిషేధం విధించిందంటూ ఇందులో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఫేక్ వార్తలను ప్రసారం చేసినట్లు తేల్చింది.
భారత సాయుధ దళాలపై, జమ్మూకశ్మీర్‌పై ఇంకా పలు సున్నిత అంశాలపై ఈ ఛానెల్స్‌లో తప్పుడు కథనాలు పోస్ట్ అయినట్లు నిర్ధారించింది. సంచలన థంబ్‌నైల్స్, పలు ప్రముఖ టీవీ ఛానెళ్ల యాంకర్స్ ఫోటోలు, లోగోలతో ఈ ఛానెళ్లు వీక్షకులను తప్పుదోవ పట్టించినట్లు గుర్తించింది. ఈ ఛానెళ్ల ద్వారా దేశ సామరస్యానికి, సమగ్రతకు, భద్రతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండటంతో వీటిపై నిషేధం విధించింది.
Also Read: Amaravathi Rythulu: మహా పాదయాత్రకు సిద్ధమవుతున్న అమరావతి రైతులు..ఎప్పటి నుంచి అంటే..!
Also Read: అవన్నీ అర్థం లేని మాటలే.. బుమ్రా, షమీ ఎప్పుడూ టీమిండియాతోనే ఉండరు: రోహిత్ శర్మ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook