థియేటర్లలో 'జనగణమన' పై కేంద్రం వెనక్కి??

థియేటర్లలో జాతీయ గీతాలాపన చేస్తున్న సమయంలో లేచి నిలబడవలసిన అవసరం లేదా? సోమవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇదే విషయాన్నితెలిపింది. 

Last Updated : Jan 9, 2018, 08:19 PM IST
థియేటర్లలో 'జనగణమన' పై కేంద్రం వెనక్కి??

థియేటర్లలో జాతీయ గీతాలాపన చేస్తున్న సమయంలో లేచి నిలబడవలసిన అవసరం ఉందా? లేదా? అనే అంశం చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. సోమవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇదే విషయాన్నితెలిపింది. థియేటర్లలో  జనగణమన ప్రదర్శితమవుతున్నప్పుడు ప్రేక్షకులు తప్పనిసరిగా లేచి నిల్చోవాల్సిన అవసరం లేదని తెలిపింది. కేంద్రం గతంలో జాతీయగీతాలాపన జరుగుతున్నప్పుడు లేచి నిల్చోవడం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే ..!  ఇప్పుడు కేంద్రం ఆ విషయంలో వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది.

సోమవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసి.. సినిమా మొదలయ్యే ముందు సినిమాహాళ్లలో జాతీయగీతం అక్కర్లేదని.. జనగణమన గీతాన్ని ఎక్కడ?ఎప్పుడు? ఆలపించాలనే దానిపై మార్గదర్శకాల రూపకల్పన కోసం ఓ కమిటీ వేశామని.. అది ఆర్నెల్లలో నివేదిక ఇస్తుందని.. అంతవరకు తాము ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేసి.. క్రితంనాటి స్థితినే కొనసాగించవచ్చని కోరింది. కాగా నేడు ఈ వ్యవహారంలో దాఖలైన పిల్ సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. సుప్రీం నేడు జాతీయ గీతంపై ఇదివరకు ఇచ్చిన ఆర్డర్స్‌ను సవరించింది. సినిమాహాళ్లలో జాతీయ గీతం ఆలపించడం తప్పనిసరి కాదంటూ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. పౌరులు తమలో దేశభక్తిని ఇలా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఇదివరకే  కోర్టు తెలిపింది. దాంతో ప్రభుత్వం  ఈ విషయంలో వెనక్కు తగ్గింది.

 

Trending News