Allu Arjun Bail Petition: ఇప్పటికే సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన ఘటనలో మైత్రీ మూవీ నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. తాము వస్తున్నామనే విషయం తెలిసే పోలీసులు అక్కడ మోహరించారు. సమాచారం లేకపోతే అంత మంది పోలీసులు అక్కడ ఎందుకు ఉన్నట్టు అని హైకోర్టులో పుష్ప 2 నిర్మాతల తరుపున లాయర్ వాదనకు కోర్టు అంగీకరించి వారిని అరెస్ట్ చేయెద్దంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీ చేసింది.
మరోవైపు ఈ కేసులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి. ఇదే సమయంలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని ప్రాసిక్యూషన్ కోరారు. సంధ్య థియేటర్ ఘటనకు అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదని..అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు నమోదు చేసిన కేసు అసలు వర్తించదన్నారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 105 అల్లు అర్జున్‌కు వర్తించదని..ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు న్యాయవాది నిరంజన్‌రెడ్డి.
మరోవైపు రేవతి మృతికి అల్లు అర్జున్ ప్రధాన కారణమని..పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగిందన్నారు. ఆయనకు బెయిల్ ఇస్తే తన పలుకుబడితో సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయన్నారు. బెయిల్ ఇస్తే పోలీసుల విచారణకు సహకరించరు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు.
సంధ్య థియేటర్ కేసు ఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. డిసెంబర్ 13వ తేదీన అల్లు అర్జున్‌కు హైకోర్టు.. నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జనవరి పదో తేదీతో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పర్మిషన్ ముగియనుంది.ఈ నేపథ్యంలో నేడు నాంపల్లి కోర్టులో ఈ కేసుకు సంబంధించి వాదనలు జరగనున్నాయి.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.