Chandrayaan 3 Updates: చంద్రుని కక్ష్యలో పరిభ్రమిస్తున్న విక్రమ్ ల్యాండర్ ఇవాళ సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధృవంపై సురక్షితంగా ల్యాండ్ కానుంది. ల్యాండింగ్ ప్రక్రియ మొత్తం స్వయం చాలకం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో సైతం ఉత్కంఠ నెలకొంది. ఆ చివరి 17 నిమిషాలపైనే మొత్తం ఆదారపడి ఉంది.
జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభమైన చంద్రయాన్ 3 ప్రయాణం ఎన్నో కీలక దశల్ని దాటుకుంటూ ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ అంటే ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లి దక్షిణ ధృవంపై అడుగుపెట్టనుంది. చంద్రయాన్ 2 ల్యాండింగ్ సమయంలో వైఫల్యం కావడంతో ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై దిగే అద్భుతమైన, అరుదైన దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూపించేందుకు ఇస్రో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాట్లు కూడా చేసింది.
చంద్రయాన్ 3 లైవ్ స్ట్రీమింగ్ లింక్స్ ఇవే
ఇస్రో వెబ్‌సైట్ https://isro.gov.in
ఇస్రో యూట్యూబ్ https://youtube.com/watch?v=DLA_64yz8Ss
ఇస్రో ఫేస్‌బుక్ పేజ్ https://facebook.com/ISRO
17 మినిట్స్ ఆఫ్ టెర్రర్ అంటే ఏమిటి
చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ ఒక్కటే మిగిలింది. అదే కీలకం కూడా. ప్రస్తుతం చంద్రునికి 25/134 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ల్యాండర్ మాడ్యూల్‌ను సెకనుకు 1.68 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా చేసి ఇవాళ సాయంత్రానికి ల్యాండ్ చేయాల్సి ఉంది. అంటే చివరి 17 నిమిషాలే అత్యంత కీలకం. దీనినే 17 మినిట్స్ ఆప్ టెర్రర్ అని పిలుస్తున్నారు.
చివరి దశ అంతా స్వయం చాలకమే. అంటే ఇస్రో పర్యవేక్షణ, నియంత్రణ ఉండదు. ఎప్పుడు ఇంజన్ మండించాలి, ఎప్పుడు, ఎక్కడ దిగాలి అనేది పూర్తిగా ల్యాండర్ మాడ్యూల్ స్వయంగా నిర్ణయించుకుంటుంది.ల్యాండర్ వేగాన్ని తగ్గించుకుని ల్యాండింగ్ ప్రదేశాన్ని గుర్తిస్తుంది. ల్యాండింగ్ ప్రదేశం చదునుగా ఉండేట్టు చూసుకుంటుంది. ఇంజన్‌ను స్వయంగా మండించుకుంటుంది. పరిస్థితులు అన్నీ అనుకూలించి..వాతావరణం కూడా సహకరిస్తే అనుకున్నట్టుగానే చంద్రయాన్ 3 సేఫ్ ల్యాండింగ్ పూర్తవుతుంది.
Chandrayaan-3 Mission:
The mission is on schedule.
Systems are undergoing regular checks.
Smooth sailing is continuing.The Mission Operations Complex (MOX) is buzzed with energy & excitement!
The live telecast of the landing operations at MOX/ISTRAC begins at 17:20 Hrs. IST… pic.twitter.com/Ucfg9HAvrY
— ISRO (@isro) August 22, 2023
చంద్రయాన్ ప్లాన్ బి ఎప్పుడు
ఒకవేళ ఏదైనా కాని పరిస్థితుల్లో, అవాంతరాలు ఎదురైనా, వాతావరణం అనుకూలించకపోయినా చంద్రయాన్ 3 సేఫ్ ల్యాండింగ్ ప్రక్రియ వాయిదా పడనుంది. మరోసారి ఆగస్టు 27న ల్యాండింగ్‌కు ప్రయత్నించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook