ముంబాయిలోని ఘట్కోపర్‌లో ప్రమాదం జరిగింది. బహిరంగ ప్రదేశంలో ఛార్టర్డ్ విమానం కూలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గురువారం మధ్యాహ్నం 1:30 సమయంలో అకస్మాత్తుగా సంభవించిన ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారని స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ముంబైలో కూలిన ఛార్టర్డ్ విమానం ఉత్తర్‌ప్రదేశ్‌ది కాదని.. ముంబై యూవై ఏవియేషన్‌కి అమ్మేశామని యుపీ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.
చార్టర్డ్ విమాన ప్రమాదంలో ఒక పాదాచారుడు మరణించినట్లు, మరో ఇద్దరు గాయపడ్డారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. క్షతగాత్రులను రెస్క్యూ సిబ్బంది సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Mumbai chartered plane crash: 1 person dead and two others injured in the crash in Ghatkopar. More details awaited.
— ANI (@ANI) June 28, 2018
#WATCH: A chartered plane crashes near Jagruti building in Ghatkopar where a construction work was going on. #Mumbai pic.twitter.com/ACyGYymydX
— ANI (@ANI) June 28, 2018
#Mumbai: A chartered plane has crashed near Jagruti building in Ghatkopar where construction work was going on. More details awaited pic.twitter.com/QvDGtJqYF3
— ANI (@ANI) June 28, 2018