50 రూపాయలకు చీర ఇచ్చినా.. . 100 రూపాయలకు డ్రెస్ ఇచ్చినా జనం ఎగబడతారు. సాధారణంగా ఇలాంటి బంపర్ ఆఫర్లు షాపులు కొత్తగా ప్రారంభించిన సమయంలో చూస్తుంటాం. అలాంటి ఘటనే ఒకటి తమిళనాడులోనూ వెలుగులోకి వచ్చింది. విషయం ఏమిటంటే ఓ హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా హోటల్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ఒక రూపాయికే చికెన్ బిర్యానీ అందిస్తున్నామని రెస్టారెంట్ యాజమాన్యం ప్రకటన చేసింది. దీంతో హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇస్తున్న బంపర్ ఆఫర్ కు జనం నుంచి భారీ స్పందన వచ్చింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పొన్నేరీలో ఇలాంటి బంపర్ ఆఫర్ ప్రకటించారు. విషయం తెలుసుకున్న చికెన్ బిర్యానీ ప్రియులు వందల సంఖ్యలో హోటల్ వద్దకు చేరుకున్నారు. దీంతో హోటల్ వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
Read Also: ఆగి ఉన్న రైలులో చెలరేగిన మంటలు
ఓవైపు చికెన్ తింటే కరోనా వైరస్ సోకుతుందన్న ప్రచారాన్ని సైతం పక్కకు పెట్టేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఇలాంటి ప్రచారం వల్ల చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. ధరలు కూడా భారీగా తగ్గిపోయాయి. చికెన్ తినడం జనం మానేశారు. కానీ హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించిన బంపర్ ఆఫర్ కు మాత్రం జనం నుంచి భారీ స్పందన రావడం విశేషం.
అంతే కాదు బంపర్ ఆఫర్ ప్రకటించిన రెండు గంటల్లోనే 120 కిలోల చికెన్ బిర్యానీ అమ్ముడైంది. అంటే ప్రకటనకు ఎంతగా భారీ స్పందన వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..