ఉగ్రవాదానికి పర్యాయపదంగా మారిన పాకిస్తాన్ FATFలో బ్లాక్ లిస్ట్ లో చేరే దశలో ఉంది. దీంతో పాకిస్తాన్ ( Pakistan ) చిరకాల మిత్రుడు అయిన చైనా రంగంలోకి దిగింది. పాకిస్తాన్ ను బ్లాక్ లిస్ట్ లో చేరకుండా రక్షించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది డ్రాగన్ కంట్రీ. దీనికోసం అది చేయరాని కుట్రలు చేస్తోంది. తన అధికారాలతో చదరంగం ఆడుతోంది చైనా.
ALSO READ| Trump Residency: బిజినెస్ ట్రంప్ బ్లెడ్ లోనే ఉంది... ఇల్లు రాజభవనం కన్నా తక్కువేం కాదు
పాక్ బ్లాక్ లిస్ట్ లో చేరకుండా ఆపుతున్న చైనా
పాకిస్తాన్ చేష్టలు చూసి అది బ్లాక్ లిస్ట్ లో చేరడం ఖాయం అంటున్నారు నిపుణులు. అయితే కుట్రల డ్రాగాన్ కంట్రీ చైనా (China ) మాత్రం ఉగ్రవాద వ్యవసాయం చేసే పాకిస్తాన్ ను కాపాడటానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. అదే కోవలో మనీ లాండ్రింగ్ విషయంలో పాకిస్తాన్ కు అండగా నిలుస్తోంది చైనా.
పాకిస్తాన్ ను ఇలా సమర్థిస్తోన్న చైనా
పాకిస్తాన్ FATF గ్రే లిస్ట్ లో చేరకుండా చైనా చేసిన అన్ని ప్రయత్నాలు బెడిసికొట్టాయి. 14-18 సెప్టెంబర్ లో జరిగిన వచ్చువల్ కాంఫరెన్స్ లో 27 అంశాలపై చర్చజరిగింది.
ALSO READ : GRAND ICT Challegne: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ ఛాలెంజ్ పూర్తి చేస్తే.. రూ.50 లక్షలు మీకే సొంతం
FATF లిస్ట్ పాకిస్తాన్ ఎప్పుడు చేరింది అంటే...
2012లో తొలిసారి గ్రే లిస్ట్ లో చేరిన పాకిస్తాన్.
మూడు సంవత్సరాల తరువాత 2015లో గ్రే లిస్ట్ నుంచి బయటికి వచ్చింది.
2014 పెషావర్ లో స్కూల్ పై దాడి జరిగింది.
దాడి తరువాత పాకిస్తాన్ ను మళ్లీ గ్రే లిస్ట్ లో చేర్చాలి అని నిర్ణయించారు.
2018 జూన్ లో మళ్లీ గ్రే లిస్ట్ లో చేరిన పాకిస్తాన్
పాకిస్తాన్ కు 27 మార్గనిర్ధేశకాలు జారీ చేశారు.
ఇందులో పాకిస్తాన్ కేవలం 5 లక్ష్యాలను మాత్రమే సాధించింది.
2019 జూన్ లో బ్లాక్ లిస్ట్ లో చేరకుండా అడ్డుకున్న చైనా, టర్కీ ( Turkey ) , మలేషియా
2019 అక్టోబర్ లో FATF నుంచి పాకిస్తాన్ కు మార్గదర్శకాలు
2020 ఫిబ్రవరి వరకు ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్డర్
2020 ఫిబ్రవరి లో గ్రే లిస్ట్ లో ఉన్న పాకిస్తాన్
గ్రే లిస్ట్ అంటే...
గ్రే లిస్ట్ లో చేరిన దేశానికి ఆర్థిక సహాయం అందదు. అంటే త్వరలో ప్రపంచ దేశాల నుంచి పాకిస్తాన్ కు ఆర్థిక సహాయం అందదు. అంటే ఇప్పటికే ఆకలి కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుంటే అది చాలా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.
ALSO READ| Myster of Tardigrade: ఇదోక మొండి జీవి...కరువు, వరదలు, మంచు తుపానులు కూడా ఏమీ చేయలేవు
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR