Ganesh Immersion: గణపతి నిమజ్జన వేడుకల్లో హైటెన్షన్.. రాళ్లతో దాడులు.. 52 మంది అరెస్టు.. ఎక్కడంటే..?

Nagamangala ganesh immersion controvercy: కర్ణాటకలోని నాగ మంగళ ప్రాంతంలో వినాయక నిమజ్జన వేడుకల్లో అనుకొని ఘటన చోటు చేసుకుంది. దీనిలో కొంత మంది ఆగంతకులు గణపయ్య విగ్రహాలపై రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Written by - Inamdar Paresh | Last Updated : Sep 12, 2024, 05:00 PM IST
  • కర్ణాటక నాగమంగళలో వివాదం..
  • ఇరువర్గాల మధ్య గొడవలు..
Ganesh Immersion: గణపతి నిమజ్జన వేడుకల్లో హైటెన్షన్.. రాళ్లతో దాడులు.. 52 మంది అరెస్టు.. ఎక్కడంటే..?

Ganesh idol immersion controvecy in nagamangala: దేశంలో ప్రస్తుతం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని మాండ్య జిల్లాలో అనుకొని ఘటన చోటు చేసుకుంది. నాగమంగళలో బుధవారం గణపతి నిమజ్జన ఊరేగింపుపై రాళ్లదాడిచోటు చేసుకుంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో హైటెన్షన్ నెలకొంది.

ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో పదుల సంఖ్యలో వాహానాలు ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా.. 25 కు పైగా దుకాణాలు ఈ గొడవల్లో ధ్వంసమైనట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు.. రంగంలోకి ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. మరోవైపు అల్లర్లకు పాల్పడిన వారిని సీసీ పుటేజీ ఆధారంగా గుర్తించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో పోలీసలు.. 52 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో అల్లర్లను అదుపులోకి తీసుకొని రావడానికి.. ప్రత్యేకంగా పోలీసు బలగాల్ని సైతం ఆ ప్రాంతంలో మోహరించారు. మరోవైపు..గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర్ తెలిపారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అదుపులో ఉన్నట్లు కూడా పోలీసులు ఒక ప్రకటలో వెల్లడించారు. 

Read more: PM Modi: సీజేఐ డీవై చంద్రచూడ్  ఇంట్లో ప్రధాని మోదీ.. ఎక్స్ లో సంచలన పోస్ట్ పెట్టిన ఎంపీ..  డిటెయిల్స్..

ఈ ఘటనల వల్ల అక్కడ దుకాణాదారులు తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. కొంత మంది పోలీసులు ఒకవర్గంవారిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ ఘటనల ప్రాణ, ఆస్తినష్టాలు మాత్రం ప్రస్తుతం తెలియాల్సిఉంది. ఈ ఘటనపై పోలీసులు ఉన్నత స్థాయి విచారణ జరుపుతున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు అనవసరంగా బైటకు  రావొద్దని, ఏమైన గొడవలు జరిగితే తమకు సమాచారం ఇవ్వాలని కూడా సూచనలు చేశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News