PM Modi: సీజేఐ డీవై చంద్రచూడ్ ఇంట్లో ప్రధాని మోదీ.. ఎక్స్ లో సంచలన పోస్ట్ పెట్టిన ఎంపీ.. డిటెయిల్స్..

Pm modi visits cji ganapathi puja: సుప్రీంకోర్టు న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నివాసంలో బుధవారం నిర్వహించిన వినాయక చవితి వేడుకలకు ప్రధాని మోదీ వెళ్లారు. దీంతో ఇది దేశంలో వివాదాస్పదంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Sep 12, 2024, 09:55 PM IST
  • చంద్రచూడ్ నివాసంలో మోదీ..
  • ప్రజల్లో తప్పుడు మెస్సెజ్ పోతుందంటున్న అపోసిషన్ పార్టీలు..
PM Modi: సీజేఐ డీవై చంద్రచూడ్  ఇంట్లో ప్రధాని మోదీ.. ఎక్స్ లో సంచలన పోస్ట్ పెట్టిన ఎంపీ..  డిటెయిల్స్..

PM Modi attending Ganpati puja at cji residence row: ప్రస్తుతం దేశంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరువాడ, పల్లెపట్నంతేడా లేకుండా గణపయ్యలను ప్రతిష్టించుకుని మరీ పూజించుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. దేశంలో సుప్రీంకోర్టును అత్యున్నత ధర్మాసనంగా చెబుతుంటారు. ఈ  క్రమంలోనే డీవై చంద్రచూడ్ తన ఇంట్లో జరిగిన వినాయక చవితి ఉత్సవాలకు, పీఎం మోదీని ఆహ్వానించారు. దీంతో ఇది కాస్త వివాదాలకు కేరాఫ్ గా మారింది.  డీవై చంద్రచూడ్ ఇంటికి మోదీ బుధవారం గణపయ్య వేడుకలకు వెళ్లారు. అంతేకాకుండా.. అక్కడ ప్రత్యేకంగా.. పూజలు నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో.. డీవై చంద్రచూడ్ దంపతులు పాల్గొన్నారు. మోదీ పూజలు నిర్వహించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోవైరల్ గా మారింది. ప్రస్తుతం ఇది కాస్త దేశంలో వివాదస్పదంగా మారింది. దీనిపై అపోసిషన్ పార్టీలు సైతం ఖండించాయి. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా .. దీనిపై స్పందించారు. న్యాయమూర్తుల నియమావళిని ఉల్లంఘించినట్లేదనని అన్నారు.

రాజ్యంగా పరిధిలో పనిచేసే ఒక అత్యున్నత స్థానంలో ఉండి.. ఇలాంటి పనులు చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తారని కూడా ప్రశాంత్ భూషణ్ ట్విట్ చేశారు.  ఇదిలా ఉండగా.. మోదీ, డీవై చంద్రచూడ్ ఇంటికి వెళ్లడం పట్ల మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. సీజేఐ ఇంటికి ప్రధాని మోదీ వెళ్లడం ఎంత వరకు సమంజసమన్నారు.  

ఒక పొలిటికల్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడితో,  రాజ్యాంగ సంరక్షకుడు సమావేశం కావడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తుందన్నారు. మరోవైపు దీనిపై బీజేపీ కూడా కౌంటర్ ఇచ్చారు. ఇది కేవలం. మన సంస్కృతిలో భాగమని, ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడకూడదన్నారు.  ఇదిలా ఉండగా.. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని నిజమైన శివసేన పార్టీగా గుర్తిస్తూ మహారాష్ట్ర స్పీకర్ నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్దవ్ ఠాక్రే శిబిరం.. అత్యున్నత ధర్మాసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో.. 

ఈ పిటిషన్ విచారణకు వచ్చే సమయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి తప్పుకోవాలని సీజేఐకి ఎంపీ ఏకనాథ్ షిండే సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రతిపక్షాలను వ్యతిరేకంగా ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల జాబితాను తన ఎక్స్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు.

Read more: Viral Video: పట్టాల మీదకు వచ్చి గుర్రుగా నిద్రపోయిన యువతి.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు.. వీడియో..

దీనిలో..  కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచారం, ఢిల్లీ లిక్కర్ స్కామ్,  మనీల్యాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంశాలను మెన్షన్ చేశారు. ఈ వివాదంపై.. శివసేన ఎంపీలు ప్రియాంక చతుర్వేది, మిలింద్ దేవరలు కూడా ఘాటుగానే స్పందించారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News