7.5శాతం జీడీపీ వృద్ధిరేటును సాధిస్తాం: అరుణ్ జైట్లీ

దేశ ఆర్థిక పరిస్థితిపై అరుణ్ జైట్లీ ధీమా

Last Updated : Sep 16, 2018, 04:36 PM IST
7.5శాతం జీడీపీ వృద్ధిరేటును సాధిస్తాం: అరుణ్ జైట్లీ

దేశ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. కరెంట్‌ ఖాతా లోటును తగ్గించేందుకు, డాలర్‌తో రూపాయి మారకం విలువను బలపరిచేందుకు ఆర్థికశాఖ, ఆర్బీఐ అధికారులతో  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో శుక్ర, శనివారాల్లో ఆర్థిక సమీక్షా సమావేశం జరిగింది. శనివారం సమావేశం అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడుతూ.. 2018-19 బడ్జెట్లో అంచనా వేసిన 7.5శాతం జీడీపీ వృద్ధి రేటును సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.  

పెరుగుతున్న పన్ను ఆదాయం, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణల మద్దతుతో ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.3 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని అధిగమిస్తామని జైట్లీ వెల్లడించారు.

మూలధన వ్యయంపై స్పందిస్తూ.. ఆగస్టు 31వరకు 44 శాతం బడ్జెట్ ను ఖర్చు చేశామని, కోతలు లేకుండా ఆర్థిక సంవత్సరాన్ని ముగిస్తామన్నారు. ద్రవ్యోల్భణం నియంత్రంలో ఉందన్నారు. బడ్జెట్‌లో అంచనా వేసిన దానికంటే ఎక్కువగానే పన్ను వసూళ్లను రాబడతాం అని, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాను విక్రయించి లక్ష కోట్ల రూపాయల కంటే ఎక్కువగానే సమీకరిస్తామని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు.  అయితే.. పెట్రో ఉత్పత్తులపై కేంద్ర పన్నులను తగ్గించే అంశంపై సమావేశంలో చర్చించారా లేదా అన్న ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు జైట్లీ నిరాకరించారు.

 

Trending News