Rahul Gandhi Case: అది తప్పే కానప్పుడు క్షమాపణలు ఎందుకు చెప్పాలి, సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ

Rahul Gandhi Case: మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల వివాదంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని అభ్యర్ధించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 3, 2023, 12:18 AM IST
Rahul Gandhi Case: అది తప్పే కానప్పుడు క్షమాపణలు ఎందుకు చెప్పాలి, సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ

Rahul Gandhi Case: ప్రధాని మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని..ఈ విషయంలో క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ స్పష్టం చేశారు. తప్పు చేయనప్పుడు క్షమాపణలు చెప్పడమంటే న్యాయ ప్రక్రియను అపహాస్యం చేసినట్టేనన్నారు. ప్రస్తుత సమావేశాలకు తనను అనుమతించాలని కోరారు. 

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు తనను అనుమతించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును అభ్యర్ధించారు. మోదీ ఇంటిపేరు కేసులో తానసలు తప్పే చేయలేదని స్పష్టం చేశారు. తనపై విధించిన శిక్ష నిలబడదని నమ్ముతున్నట్టు చెప్పారు. ఈ కేసు చిన్నదే కానీ అసాధారణమైందని రాహుల్ గాంధీ తరపు న్యాయవాది తెలిపారు. ఫిర్యాదుదారుడికి సైతం ఎలాంటి నష్టం జరగనందున రాహుల్ గాంధీకి విధించిన శిక్షను నిలిపివేయాలని కోరారు. అదే సమయంలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేలా ఆదేశాలివ్వాలని కోరారు.

మోదీ పేరుతో ఎలాంటి వర్గం లేదని అసలు అధికారికంగా మోదీ సమాజం, మోదీ వర్గమనేవి లేనప్పుడు తన వ్యాఖ్యలు ఓ వర్గం మొత్తాన్ని కించపరర్చడమనేది ఉండదన్నారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, మెహుల్ చోక్సీలు ఒకే సామాజికవర్గానికి చెందినవారు కూడా కాదన్నారు. అందుకే తనపై శిక్ష నిలబడజాలదన్నారు. 

మోదీ ఇంటిపేరును దూషించారనే కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకు రెండేళ్ల జైలుశిక్ష విధించగా..దీనిని ఆధారం చేసుకుని పార్లమెంట్ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది. సూరత్ కోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీకు అక్కడ నిరాశే ఎదురైంది. ఆ తరువాత రాహల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

Also read: Fake Universities: ఆ 20 యూనివర్శిటీలు నకిలీ, తేల్చిచెప్పిన యూజీసీ

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitte , Facebook

Trending News