Nyay Patra: దేశ ప్రజలపై కాంగ్రెస్ పార్టీ వరాల జల్లు కురిపించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాము అధికారంలోకి ప్రజలకు చేసే మేలుపై 'న్యాయ్ పత్ర' పేరిట మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ సీనియర్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను ఆ పార్టీ నాయకులు మీడియాకు వివరించారు. పదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా విజయం సాధించడానికి ప్రజలకు భారీ తాయిలాలు ప్రకటించింది. ఈ మేనిఫెస్టో పేదల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చేది అని పేర్కొన్నారు. పేదలకు ఈ మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు ఖర్గే అంకితం చేశారు.
Also Read: Revanth Vs Bhatti: రేవంత్ రెడ్డి వర్సెస్ భట్టి.. రెండుగా చీలిన తెలంగాణ కాంగ్రెస్?
రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర'లో ప్రకటించిన ఐదు న్యాయాలతోపాటు 25 గ్యారంటీలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. 'యువ, మహిళ, కిసాన్, శ్రామిక్, హిస్సేదార్, రక్షా న్యాయ్' పేరిట ఐదు రకాల్లో మేనిఫెస్టో ఉంది. ఉద్యోగాలు, సంపద, సంక్షేమం ప్రధాన ఇతివృత్తంతో 48 పేజీల మేనిఫెస్టోను రూపొందించారు. ప్రకటించి ఐదింటి గురించి తెలుసుకుందాం.
Also Read: Kavitha Bail: ఎమ్మెల్సీ కవితపై ఈడీ సంచలన వ్యాఖ్యలు.. ఇక జైలు బయటకు రానట్టే?
యువ న్యాయ్
ప్రతి విద్యావంతుడికి అప్రంటీస్‌గా పని చేసే అవకాశం.
ఒక్కొక్కరికి రూ.లక్ష సహాయం.
మార్చి 15 నాటికి ఉన్న విద్యా రుణాలు మొత్తం రద్దు.
రైట్ టూ అప్రంటీస్ చట్టం
మహిళా న్యాయ్
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.లక్ష సాయం
మైనార్టీలకు వస్త్రధారణ, ఆహారం, భాష పర్సనల్ లాను ఎంచుకునే హక్కు
కిసాన్ న్యాయ్
రైతులకు రుణమాఫీ, కనీస మద్దతు ధర చట్టం.
వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ రద్దు
శ్రామిక్ న్యాయ్
ఉపాధి హామీ పథకంలో కనీసం రూ.400 వేతనం.
హిస్సేదార్ న్యాయ్
సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం జాతీయ జనగణన.
రాష్ట్రాలకు న్యాయపూర్వకంగా అందాల్సిన నిధులు చెల్లింపు.
రక్ష న్యాయ్
విదేవీ వ్యవహార విధానంలో మార్పులు
25 హామీల్లో కీలకమైనవి ఇవే
- అగ్నిపథ్ పథకం రద్దు
- 8 కోట్ల కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పంపిణీ
- జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా
- తప్పుడు వార్తల నియంత్రణకు 1938 నాటి ప్రెస్ కౌన్సిల్ ఇండియా చట్టం సవరణ.
- పెగాసస్, రాఫెల్ కుంభకోణంపై విచారణ
- ఎలక్టోరల్ బాండ్లపై విచారణ
- 50 శాతం రిజిర్వేషన్ల పరిమితి ఎత్తివేత
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు
- రైల్వే చార్జీల తగ్గింపు. వృద్ధులకు రాయితీ
- రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేత
- పదేళ్లలో 23 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు తీసుకురావడం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook