Election Result 2024 Congress Analysis: 2024లో పార్లమెంట్ కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడోసారి ఓటమి పాలు కావడంతో ఆ పార్టీ హై కామాండ్ పోస్ట్ మార్టం మొదలు పెట్టిందా... అధికారానికి దగ్గరగా వచ్చి దూరం కావడానికి గల కారణాలను అన్వేషించే పనిలో పడింది. ముఖ్యంగా కీలకమైన ఆ నాలుగు రాష్ట్రాల్లో తక్కువ సీట్లు రావడం వల్లే అధికారం దక్కకుండా పోయిందనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లలో అనుకున్న మేర సీట్లు రాకపోవడం పైనే దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆ నాలుగు రాష్ట్రాల్లో ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది.
18వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడమే లక్ష్యoగా... ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో, న్యాయ్ యాత్రలతో దేశం మొత్తాన్ని చుట్టేసిన ఆశించిన ప్రయోజనం దక్కలేదు. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకొని 52 సీట్ల నుంచి 99 సీట్లకు ఎగబాకింది. ఈ సారి ఖచ్చితంగా అధికారం లోకి రావడమే లక్ష్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికి మరో సారి నిరాశే మిగిలింది. గత పార్లమెంట్ ఎన్నికలకంటే ఈ సారి ఇండియా కూటమికి మెజారిటీ సీట్లు వచ్చాయి. కానీ అధికారo మాత్రం దక్కలేదు. దీంతో అధికారం దూరమవడానికి గల కారణాలు ఏంటనీ వెతికే పనిలో పడింది కాంగ్రెస్ అధిష్ఠానం. దానిలో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై పోస్ట్ మార్టం నిర్వహిస్తోంది.
ఈ పోస్ట్ మార్టమ్ లో భాగంగా ప్రధానంగా తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ తో పాటు ఛత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్ లో పార్టీ వైఫల్యం చెందరడం వల్లనే అధికారంకి దూరమయ్యమనే నిర్ణయానికి అధిష్టానం వచ్చిందంట.ముఖ్యంగా ఈ నాలుగు రాష్ట్రాల్లో అనుకున్న సీట్లు సాధించి ఉంటే మ్యాజిక్ ఫిగర్ వచ్చేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ,కర్ణాటకలో అధికారంలో ఉండి కూడా అనుకున్న సీట్లు ఎందుకు సాధించలేదని హై కమాండ్ ఆ రాష్ట్ర నాయకత్వాలపై సీరియస్ అయినట్టు సమాచారం.
తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు ఉంటే 8 స్థానాలని మాత్రమే అధికార పార్టీకి దక్యాయి. కర్ణాటకలో సైతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా 11 సీట్లతో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ప్రతి పక్ష పార్టీ బీజేపీ, జేడీఎస్ కలిపి 19 స్థానాలు కైవసం చేసుకుంది. అటు అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో ఖాతానే ఓపెన్ చేయలేదు. వీటితో పాటుఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లలో కూడా ఖాతా తెరవలేకపోయింది. దీనితో అధిష్టానం నాలుగు రాష్ట్రాల నాయకత్వలపై సీరియస్ అయినట్టు సమాచారం. అంతేకాదు త్వరలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన చేయబోతుందనే వార్తలు వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter