Rahul Gandhi: పెట్రోల్ ధరల తగ్గింపు కేవలం కంటితుడుపు చర్యే..రాహుల్ గాంధీ ఆగ్రహం..!

Rahul Gandhi: పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కంటి తడుపు చర్యల్లో భాగంగానే ప్రధాని మోదీ ఇలా చేశారని విపక్షాలు మండిపడుతున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 22, 2022, 09:04 PM IST
  • దేశంలో పెట్రోల్ రగడ
  • కేంద్రంపై విపక్షాల ఆగ్రహం
  • తాజాగా రాహుల్ విసుర్లు
Rahul Gandhi: పెట్రోల్ ధరల తగ్గింపు కేవలం కంటితుడుపు చర్యే..రాహుల్ గాంధీ ఆగ్రహం..!

Rahul Gandhi: పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కంటి తడుపు చర్యల్లో భాగంగానే ప్రధాని మోదీ ఇలా చేశారని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇన్ని రోజులు ప్రజలపై ఎందుకు భారం మోపారని ప్రశ్నిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్‌ సీనియర్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.

ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని..కంటితుడుపు చర్యలు తీసుకున్నారని ఫైర్ అయ్యారు. భారీ స్థాయిలో తగ్గించారని బీజేపీ నేతలు గొప్పలు  చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రికార్డు స్థాయిలోకి వెళ్తున్న ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలన్నారు రాహుల్. ఈమేరకు ట్విట్‌ చేశారు. ఇందులో 2020 మే 1న పెట్రోల్‌ ధరల గురించి ప్రస్తావించారు. 

ఆ సమయంలో లీటర్ పెట్రోల్ ధర రూ.69.5గా ఉందని తెలిపారు. 2022 మార్చి నాటికి రూ.95.4కు పెంచారని వివరించారు. మే నాటికి రూ.100 దాటిపోయిందని మండిపడ్డారు. ఇప్పటికైనా చమురు ధరలపై ప్రజలకు లెక్కలు చెప్పాలన్నారు. కేంద్ర తీరుపై ఆ పార్టీ సీనియర్ నేత గౌరవ్‌ వల్లభ్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ జిమ్మిక్కులకు ఇప్పటికైనా ఆపాలన్నారు. గత రెండు నెలలుగా పెట్రోల్‌, డీజిల్ ధరలు అమాంతంగా పెంచారని గుర్తు చేశారు.

కేవలం కంటితుడుపుగా రూ.9.5 తగ్గించారని మండిపడ్డారు. ఎల్‌పీజీ ధరను రూ.400  పెంచి..కేవలం రూ.200 తగ్గించారని..ఎందులో ఉన్న అంతర్యమేమిటన్నారు. ఇంధన ధరల బాదుడుతో ప్రజల రక్తాన్ని తాగుతున్నారని విమర్శించారు. మరోవైపు విపక్షాల తీరుపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. ప్రజలకు ఉపశమనం కల్గించేందుకే చమురు ధరలు తగ్గించామని స్పష్టం చేస్తోంది. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాజకీయం చేస్తున్నాయని కేంద్రమంత్రులు కౌంటర్ ఇచ్చారు. 

Also read:Exercise Video: వ్యాయామం చేయడానికి ఇంకో ప్లేస్ దొరకలేదా నాయనా.. అక్కడి నుంచి పడితే కథ కంచికే!

Also read:China Corona: పుట్టినిల్లులో కోవిడ్ విజృంభణ..కీలక నగరాల్లో లాక్‌డౌన్‌ విధింపు..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News