Odisha Cabinet: ఒడిశాలో ఇవాళ రాజకీయాలు చకచక మారిపోయాయి. నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలోని మంత్రులంతా రాజీనామా చేశారు. దీంతో ఆ రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో 20 మంది మంత్రులు రాజీనామా చేశారు. కొత్త మంత్రులు రేపు కొలువుదీరనున్నారు. రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. మంత్రుల చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
ప్రస్తుతం రాజీనామా చేసిన కొందరిని మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ అనుసరించిన వ్యూహాలనే నవీన్ పట్నాయక్ అనుసరిస్తున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కేబినెట్ కూర్పు ఉండనుంది. మంత్రివర్గంలో చోటు దక్కని వారికి పార్టీలో కీలక పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవలే నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ప్రభుత్వం మూడేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. ఈక్రమంలో కేబినెట్ విస్తరణను పూనుకున్నారు.
ఒడిశాలో 2024లోనే ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఐదోసారి నవీ పట్నాయక్ ప్రభుత్వం పాలిస్తోంది. ఈసారి కూడా ప్రజా వ్యతిరేకతను దాటుకుని మరోసారి అధికారంలోకి రావాలని యోచిస్తున్నారు. ఈదిశగా పావులు కదుపుతున్నారు. ఐతే కొందరు మంత్రుల పనితీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉందన్న ప్రచారం ఉంది. ఈక్రమంలోనే నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
పార్టీకి, ప్రభుత్వానికి చేటు తెచ్చే వారిని దూరంగా పెట్టాలని ఆయన భావిస్తున్నారు. ఇటీవల బ్రజరాజనగర్ ఉప ఎన్నికల్లో బిజూ జనతా దళ్ ఘన విజయం సాధించింది. ఆ గెలుపు నవీన్ పట్నాయక్ టీమ్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మరోవైపు ఒడిశాలో పాగా వేయాలని బీజేపీ స్కెచ్‌లు వేస్తోంది. ఆ పార్టీకి అవకాశం ఇవ్వకుండా మళ్లీ గెలవాలని నవీ పట్నాయక్ భావిస్తున్నారు. ఆ దిశగా పార్టీని సంసిద్ధం చేస్తున్నారు.
Also read: Vastu Tips For Floor: ఇంట్లో టైల్స్ వేసేటప్పుడు ఈ విషయాలు గుర్తించుకోండి!
Also read:Minister Ktr Comments: తన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తా..మంత్రి కేటీఆర్ సవాల్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook