Pune thief steals jewellery video viral: చాలా మంది కేటుగాళ్లు కష్టపడకుండా డబ్బులు సంపాదించడమే పనిగా పెట్టుకుంటున్నారు. చోరీలు చేయడం, జనాలని ఏదో రకంగా మోసం చేయడం వంటి పనులు ఎక్కువగా చేస్తున్నారు. ముఖ్యంగా బైక్ ల మీద ఇటీవల కాలంలో చోరీలు ఎక్కువగా చేస్తున్నారు. రోడ్డు మీద లేదా ఇంట్లో సింగిల్ ఉన్న వాళ్లను టార్గెట్ గాచేసుకుంటారు. కొంత మంది ఏదొ అడ్రస్ అడిగినట్లు వచ్చి చోరీలకు పాల్పడుతున్నారు.
A couple's gold jewellery valued at ₹ 4.95 lakh was stolen while they paused to buy vada pav after picking it up from a bank. The incident took place on Thursday outside a vadapav shop in Shewalewadi.#goldchain #shewalewadi #Pune #punepolice #robbery pic.twitter.com/oFYGmuTso4
— Pune Pulse (@pulse_pune) August 30, 2024
మరికొందరు మాత్రం రెక్కి వేసి.. మరీ మెల్లగా చోరీలు చేస్తుంటారు. బస్టాండ్ లు, రైల్వే స్టేషన్ లు, బ్యాంక్ ల వద్ద చోరీలు కామన్ గా మారాయి. వీళ్లు ముఖ్యంగా ఒంటరిగా వచ్చేవాళ్లు, పెద్ద వయస్సు వళ్లను టార్గెట్ గా చేసుకుని చోరీలు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం పూణేలో జరిగిన ఒక చోరీ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
మహారాష్ట్రలోని పూణేలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పూణెకు చెందిన వృద్ధ దంపతులు టూవీలర్ మీద వెళ్తూ వడ పావ్ తినడానికి రోడ్డు పక్కన ఆగారు.ఇంతలో.. భర్త వడ పావ్ ఆర్డర్ చేయడానికి వెళ్లగా.. భార్య ద్విచక్ర వాహనం వద్దనే ఉన్నారు. వీరి టూవీలర్ కు ముందు భాగంలో.. బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ తగిలించి ఉంది. అందకు సదరు మహిళ కూడా అక్కడే నిలబడింది. కానీ ఇంతలో ఒక ఆగంతకుడు ఆమె ముందు నుంచి సెకన్ల కాలంలో బ్యాగ్ తీసుకుని పారిపోయాడు. ఆమె అరుస్తుండగానే.. చూస్తుండగానే మాయామైపోయాడు.
ఆ సంచిలో సుమారు ఐదు లక్షల రూపాయిల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నట్లు బాధితులు తెలిపారు. మంజరిలోని వైట్ ఫీల్డ్ సొసైటీలో నివాసం ఉంటున్న వృద్ధ దంపతులను దష్త్రాత్ బాబాలాల్ ధామ్నే, అతని భార్య జయశ్రీ తమ బంగారాన్ని గతంలో బ్యాంకులో తాకట్టుపెట్టి రుణం తీసుకున్నారు.
తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఇంటికి తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఇంటికి వెళ్తుండగా పూణె- షోలాపూర్ రోడ్డులో ఉండగా ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దీంతో బాధితులు లబోదిబో మంటున్నారు.
ఆగంతకుడు.. తెల్లటి చొక్కా ధరించి ఉన్నట్లు తెలుస్తోంది. చోరీకి సంబంధించిన ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ కు గురౌతున్నారు. పట్టపగలు ఈచోరీలేంటని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు బంగారం ఉన్న బ్యాగ్ ను ఇంత అజాగ్రత్తగా టూవీలర్ కు వదిలేసి వెళ్తారా.. అంటూ కూడా కౌంటర్ వేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.