Death Threat To Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పదిరోజుల్లోగా రాజీనామా చేయాలని లేకుంటే.. బాబా సిద్దీఖీ కన్నా ఘోరంగా చంపబడతారని కూడా ముంబై పోలీసులకు బెదిరింపుల సందేశం వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక రాష్ట్ర బీజేపీ సీఎంకు, అది కూడా కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారంలో ఉండగా ఇలాంటి ఘటన ఒక్కసారిగా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
దీంతో ముంబై పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అయితే.. ఈ బెదిరింపులు సందేశం పంపింది మాత్రం.. థానేకు చెందిన 24 ఏళ్ల యువతి అని బైటపడింది. సదరు ఫాతీమా ఖాన్ అనే యువతి.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో BSc డిగ్రీని చదువుతోందని తెలుస్తొంది. ఆమె తండ్రి కలప వ్యాపారం చేస్తున్నాడని సంబంధిత వర్గాలు తెలిపాయి.
అయితే.. ఆ యువతి ఇలా ఒక సీఎంను బెదిరింపుల ఘటనపై ఆరా తీసినట్లు తెలుస్తొంది. ఆమెనే చేసిందా.. ఎవరైన ఆమెను బ్రైన్ వాష్ చేశారా.. దీని వెనుకాల ఎవరున్నారని ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తొంది. ఈ ఘటన మాత్రం ఒక్కసారిగా పోలీసు శాఖలో పెనుదుమారంగా మారిందని తెలుస్తొంది. ఇదిలా ఉండగా.. మరో వైపు సల్మాన్ ఖాన్ కు కూడా గతంలో ఇలానే బెదిరింపులు వచ్చాయి.
Read more: Holiday: వావ్.. మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. నవంబర్ 7న పబ్లిక్ హలీడే.. కారణం ఏంటో తెలుసా..?
అంతే కాకుండా.. రూ. 5 కోట్లు ఇవ్వలని జార్ఖండ్ కు చెందిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అంతే కాకుండా. . ప్రస్తుతం అతడ్ని రిమాండ్ కు తరలించినట్లు తెలుస్తొంది. మరో వైపు సల్మాన్ ఖాన్ సైతం ఈ ఘటన తర్వాత బందో బస్తును పెంచుకున్నట్లు తెలుస్తొంది. బుల్లెట్ ప్రూఫ్ కారును సైతం కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే.. పోలీసులు మాత్రం ప్రస్తుతం ఈ బెదిరింపుల ఘటనపై సీరియస్ అయినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.