Less luggage less price:‌ కేవలం కేబిన్ లగేజ్ మాత్రమే ఉందా..అయితే టిక్కెట్ ధర తగ్గుతుంది మీకు

Less luggage less price: లెస్ లగేజ్..మోర్ కంఫర్ట్. ఇది నిన్నటి వరకూ విన్పించిన మాట. ఇప్పుడు లెస్ లగేజ్..లెస్ ప్రైస్. అది కూడా విమానాల్లో. నిజమే. లగేజ్ తక్కువుంటే దేశీయ  విమాన టిక్కెట్ ధరల్లో డిస్కౌంట్ లభించనుంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 27, 2021, 09:56 AM IST
  • దేశీయ విమానాల్లో ఇకపై లెస్ లగేజ్ లెస్ ప్రైస్ విధానం
  • కేవలం కేబిన్ లగేజ్ మాత్రమే ఉంటే టిక్కెట్ ధరలో డిస్కౌంట్ పొందేందుకు డీజీసీఏ అనుమతి
  • విమాన ఛార్జీలు 10-30 శాతం పెరిగిన నేపధ్యంలో ప్రయాణీకులకు కొత్త విధానంతో కాస్త ఊరట
Less luggage less price:‌ కేవలం కేబిన్ లగేజ్ మాత్రమే ఉందా..అయితే టిక్కెట్ ధర తగ్గుతుంది మీకు

Less luggage less price: లెస్ లగేజ్..మోర్ కంఫర్ట్. ఇది నిన్నటి వరకూ విన్పించిన మాట. ఇప్పుడు లెస్ లగేజ్..లెస్ ప్రైస్. అది కూడా విమానాల్లో. నిజమే. లగేజ్ తక్కువుంటే దేశీయ  విమాన టిక్కెట్ ధరల్లో డిస్కౌంట్ లభించనుంది. 

దేశీయ విమాన ప్రయాణాలు చేసేవారికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( Director general of civil aviation ) గుడ్‌న్యూస్ విన్పిస్తోంది. తక్కువ లగేజ్‌తో ప్రయాణం చేస్తే టిక్కెట్ ధరలో డిస్కౌంట్ పొందే సౌలభ్యాన్ని కల్పిస్తోంది. లెస్ లగేజ్..లెస్ ప్రైస్ ( Less luggage less price) అన్న మాట. కేవలం కేబిన్ లగేజ్‌తో ప్రయాణించేవారికి దేశీయ విమాన టిక్కెట్ ధరల్లో డిస్కౌంట్ ఇవ్వడానికి డీజీసీఏ అనుమతిచ్చింది. అంటే ఇకపై ఎక్కువగా లగేజ్ లేకపోయినా లేదా చిన్న బ్యాగుతోనే ప్రయాణించాలనుకున్నా సరే టిక్కెట్ ధర ఇక చౌకగా లభించనుంది. సాధారణంగా కేబిన్ లగేజ్ కింద 7 కేజీలు, చెక్‌ఇన్ లగేజ్‌గా 15 కేజీలు తీసుకెళ్లవచ్చు. అంతకంటే ఎక్కువ బరువుంటే అదనపు ఛార్జీలు ఉంటాయి. మరి నిర్ణీత బరువు కంటే తక్కువ ఉంటే తక్కువ ధర వసూలు చేసేలా సౌకర్యం ఉంటుందిక.

ఈ కొత్త ప్రైస్ విధానం అమల్లో వస్తే దేశీయ విమాన ( Domestic airlines ) ప్రయాణీకులు టిక్కెట్ బుకింగ్ సమయంలోనే తమ లగేజ్‌ను స్పష్టం చేయాల్సి ఉంటుంది. తక్కువ లగేజ్ ఉన్నవారికి టిక్కెట్ డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. ప్రత్యేకంగా ఒక సీటు కావాలన్నా లేదా భోజనం, స్నాక్స్ వంటివి అడిగినా, మ్యూజిక్ వినాలన్నా సరే విమానయాన సంస్థలు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ సర్వీసులు లేకపోతే మాత్రం టీకెట్ ధర తగ్గుతుంది. అదే విదంగా తక్కువ లగేజ్ ఉంటే టికెట్ తగ్గించే అవకాశాన్ని డీజీసీఏ ( DGCA ) ప్రయాణీకులకు కల్పించింది. విమానయాన సంస్థల్ని నష్టాల్నించి బయటపడేయడానికి కేంద్రం ఇటీవలే విమాన ఛార్జీలను 10-30 శాతం పెంచాలని నిర్ణయించింది. ఇప్పుడీ కొత్త విధానంతో కాస్త ఊరట కలగవచ్చు.

Also read: West Bengal Election: బెంగాల్‌‌లో 8 దశల్లో ఎన్నికలు జరపడంపై మమతా బెనర్జీ ఆగ్రహం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News