Micro Labs Freebies Case: బెంగళూరుకి చెందిన ఫార్మా కంపెనీ మైక్రో ల్యాబ్స్‌పై సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. మైక్రో ల్యాబ్స్ ఉత్పత్తి చేసే డోలో 650 మెడిసిన్ ప్రమోషన్, విక్రయాల కోసం ఆ సంస్థ రూ.1000 కోట్ల మేర డాక్టర్లకు చెల్లించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నది. కానుకలు, నగదు రూపంలో డాక్టర్లకు ఈ మొత్తాన్ని అందజేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణకు రాగా మైక్రో ల్యాబ్స్ సంస్థ తమపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది.
కోవిడ్ 19 మహమ్మారి వ్యాప్తి పీక్స్‌లో ఉన్న సమయంలో రూ.350 కోట్ల మేర డోలో 650 ఉత్పత్తుల విక్రయాలు జరిగాయని మైక్రో ల్యాబ్స్ పేర్కొంది. పీక్ స్థాయిలోనే రూ.350 కోట్ల మేర విక్రయాలు జరిగితే.. రూ.1000 కోట్లు ఖర్చు చేసి ఆ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడమనేది అసాధ్యమని తెలిపింది. పైగా డోలో 650 జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలో ఉందని గుర్తుచేసింది. కోవిడ్ సమయంలో కేవలం డోలో 650 మాత్రమే కాదు విటమిన్ సీ, విటమిన్ కాంబినేషన్ మాత్రల విక్రయాలు కూడా భారీగా జరిగాయlని తెలిపింది. వైరల్ ఫీవర్, కోవిడ్ కారణంగా డోలో 650కి మార్కెట్లో ఇప్పటికీ చాలా డిమాండ్ ఉందని పేర్కొంది.
ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FMRAI) అనే ఎన్జీవో సంస్థ ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. తాజాగా దీనిపై విచారణ జరిగింది. మైక్రో ల్యాబ్స్ సంస్థపై ఇన్కమ్ ట్యాక్స్ దాడులు,సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) తేల్చిన వివరాల ఆధారంగా ఎఫ్ఎంఆర్ఏఐ ఈ పిటిషన్ దాఖలు చేసింది. మైక్రో ల్యాబ్స్ వంటి సంస్థలు చేస్తున్న అనైతిక చర్యలకు అడ్డుకట్ట వేయాలని ఎఫ్ఎంఆర్ఏఐ తాజా పిటిషన్ ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేసింది
ఎఫ్ఎంఆర్ఏఐ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన బెంచ్.. ఇది సీరియస్ వ్యవహారమని పేర్కొంది. తాను కోవిడ్ బారినపడిన సమయంలో వైద్యులు తనకు కూడా డోలో 650 తీసుకోవాల్సిందిగా సూచించారని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. మైక్రో ల్యాబ్స్ సంస్థపై ఎఫ్ఎంఆర్ఏఐ చేస్తున్న ఆరోపణలపై కేంద్రం 10 రోజుల్లోగా స్పందించాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది.
డోలో 650 ప్రమోషన్, విక్రయాల కోసం మైక్రో ల్యాబ్స్ సంస్థ రూ.1000 కోట్లు వైద్యులకు ముట్టజెప్పినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో... ఆ సంస్థ నుంచి కానుకలు లేదా నగదు అందుకున్న వైద్యులు ఎవరనే దానిపై నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఫోకస్ చేసింది. ఆ వైద్యుల వివరాలను అందించాల్సిందిగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ను కోరింది. మొత్తం మీద ఈ వ్యవహారం ఫార్మా రంగంలో పెద్ద దుమారమే రేపుతోంది.
Also Read:Actress Namitha blessed with twins: నమితకు కవల పిల్లలు.. ఫోటోలు చూశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook