భారత రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆకాశ్-1ఎస్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని బాలాసోర్ తీరం నుంచి డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు సోమవారం దీనిని సక్సెస్‌ఫుల్ గా ప్రయోగించారు.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో...
భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం గల ఈ క్షిపణిని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినట్లు డీఆర్‌డీవో వెల్లడించింది. కాగా రెండు రోజుల వ్యవధిలో ఈ క్షిపణిని రెండు సార్లు విజయవంతంగా ప్రయోగించినట్లు డీఆర్‌డీవో అధికారులు తెలిపారు. ఆకాశ్-1ఎస్ క్షిపణిని మే 25, 27న పరీక్షించినట్లు పేర్కొన్నారు.
ఆకాశ్-1ఎస్ శక్తిసామర్థాలు ఇవే..
తాజా ప్రయోగంతో భారత అమ్ములపొదిలో మరో అస్త్రం వచ్చి చేరినట్లయింది. ఆకాశ్-1ఎస్ క్షిపణి ఎలాంటి పరిస్థితుల్లోలైనా శత్రువులు దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టగలదు. ఆకాశ్ 1ఎస్ క్షిపణితో ఫైటర్ జెట్స్‌ను టార్గెట్ చేయడం సులువు అవుతుంది. భూ ఉపరితలం నుంచి 18 నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శత్రు దేశాల యుద్ధ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులు, క్రూయీజ్ క్షిపణులతో పాటు డ్రోన్లను ఆకాశ్- 1ఎస్ సమర్థంగా కూల్చేయగలదు.
DRDO today successfully test fired the Akash-1S surface to air defence missile system. This is the second successful test of the missile in last two days. This is a new version of the missile fitted with an indigenous seeker. pic.twitter.com/KK6Ig8XoK7
— ANI (@ANI) May 27, 2019