నేటి నుంచి ఐదు రాష్ట్రాల్లో ఈవే బిల్లులు అమలు

ఒక రాష్ట్రం పరిధిలో (ఇంట్రా స్టేట్‌) వస్తు రవాణాకు వీలుగా ఈవే బిల్లు విధానానికి శ్రీకారం చుట్టిన కేంద్ర ఆర్థిక శాఖ ఆ దిశగా అడుగులు వేసింది.

Updated: Apr 16, 2018, 05:04 PM IST
నేటి నుంచి ఐదు రాష్ట్రాల్లో ఈవే బిల్లులు అమలు

ఒక రాష్ట్రం పరిధిలో (ఇంట్రా స్టేట్‌) వస్తు రవాణాకు వీలుగా ఈవే బిల్లు విధానానికి శ్రీకారం చుట్టిన కేంద్ర ఆర్థిక శాఖ ఆ దిశగా అడుగులు వేసింది. నేటి నుంచి ఈవే బిల్లులు ఐదు రాష్ట్రాల్లో అమలులోకి రానున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌లో తొలి దశలో ఇది అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఏప్రిల్‌ 1 నుంచి ఎలక్ట్రానిక్‌ వే బిల్లింగ్‌ విధానాన్ని పలు రాష్ట్రాల మధ్యవస్తు రవాణాకు ప్రారంభించిన విషయం తెలిసిందే.

తొలి దశలో ఈ ఐదు రాష్ట్రాల్లో ఈవే బిల్లు అమలుతో తదుపరి దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుందని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ రాష్ట్రాల్లోని వర్తకులు, ట్రేడర్లు, రవాణా సంస్థలు ఈవే బిల్లు పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించింది. ఈ నెల 1 నుంచి ఇంట్రాస్టేట్‌ ఈవే బిల్లు విధానాన్ని కర్ణాటక రాష్ట్రం ఒక్కటే ప్రారంభించింది.

దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రాల సరిహద్దులోని చెక్‌పోస్టులు చేసే పనులు ఇకపై సరుకు రవాణ చేసే సంస్థలు ఆన్‌లైన్‌లోనే ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. సరుకు కొనుగోలుదారుడు నుండి రవాణాసంస్థలు ఈవేబిల్లుకు అయ్యే ఖర్చులు వసూలు చేస్తారు. గతంలో జిఎస్టీ పోర్టల్‌లో ఏవిధంగా నమోదు చేసుకున్నారో అదే విధంగా ఈవే పోర్టల్‌లోనూ సదరు వ్యాపార సంస్థలు నమోదు కావలసి ఉంటుంది. ఇకపై ఇతర రాష్ట్రాలకు రవాణా అయ్యే ప్రతీ వస్తువుకూ ఈవేబిల్లు అవసరం ఉంటుంది. రూ.50 వేలకు మించిన సరుకు కొనుగోలు చేసినట్లయితే రవాణా సమయంలో సరుకులతో పాటు ఈవేబిల్లును తన వెంట ఉంచుకోవాలి. రూ.50 వేలకు కంటే తక్కువ విలువ ఉన్న సరుకులకు కూడా ఈవేబిల్లు తీసుకోవాల్సి ఉంటుంది.