Election Commission Appoints Maithili Thakur As Bihar’s State Icon: బీహార్ కు చెందిన జానపద గాయని మైథిలీ ఠాకూర్‌ను భారత ఎన్నికల సంఘం తన ఐకాన్ గా ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో మైథిలీ ఠాకూర్ 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్‌లో ఓటరు అవగాహన ప్రచారాన్ని నిర్వహించనున్నారు. గతంలో 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మైథిలీని మధుబని జిల్లాకు ఎన్నికల ఐకాన్‌గా నియమించారు.
మధుబని జిల్లా 47వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పుడు ఆమెను బీహార్ మొత్తానికి ఐకాన్ గా ప్రకటించారు. ఇక ఈ నియామకం అనంతరం మైథిలీ ఠాకూర్ మాట్లాడుతూ.. ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం అని, నేను ఎల్లప్పుడూ సహకరించడానికి ప్రయత్నిస్తానని, మీరందరూ ఆశీర్వదించాలని అన్నారు. భారతీయ శాస్త్రీయ, జానపద సంగీతంలో శిక్షణ పొందిన ఠాకూర్ బీహార్ జానపద సంగీతానికి చేసిన కృషికి గానూ ఇటీవలే సంగీత నాటక అకాడమీ యొక్క ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ 2021కి కూడా ఎంపికయ్యారు.
ఇక బీహార్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఐకాన్ గా జానపద గాయని మైథిలీ ఠాకూర్‌ను నియమించే ప్రతిపాదనను ECI ఆమోదించినట్లు బీహార్ ప్రధాన ఎన్నికల అధికారికి ఎన్నికల సంఘం పంపిన లేఖలో పేర్కొంది. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ఆమె ఓటర్లకు అవగాహన కల్పిస్తారని రాష్ట్ర ఎన్నికల సంఘం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఇక ఈ నియామకం గురించి మైథిలి తండ్రి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌కు, బీహార్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మైథిలి ఫోక్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మైథిలీ ఠాకూర్ భోజ్‌పురి, హిందీ, పంజాబీ, రాజస్థానీతో పాటు అనేక ఇతర భాషల్లో పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
Also Read: Myron Mohit Remand Report: హీరోయిన్ భర్త రిమాండ్ రిపోర్టులో సంచలనం.. షారుఖ ఖాన్ కొడుకు కేసులో కూడా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook