New Pension Rules in Telugu: ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ సభ్యులకు కీలకమైన అప్డేట్ ఇది. ఇకపై దేశంలోని ప్రైవేట్ ఉద్యోగులు, ఈపీఎఫ్ సభ్యులు ఏ బ్యాంక్ లేదా ఏ శాఖలోంచి అయినా పెన్షన్ విత్ డ్రా చేసుకునే సౌలభ్యం ఉంది. ఈ కొత్త సౌకర్యం ఈపీఎఫ్ సభ్యులకు 2025 జనవరి 1 నుంచి అందుబాటులో రానుంది. ఫలితంగా దేశవ్యాప్తంగా 78 మంది లక్షలకు ప్రయోజనం కలగనుంది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్‌ను ఆమోదించింది. ఉద్యోగుల పెన్షన్ పథకం 1995 ప్రకారం సీపీపీఎస్ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఇకపై పెన్షనర్లు తమ పెన్షన్‌ను దేశంలోని ఏ బ్యాంకులోంచి లేదా ఏ శాఖలోంచి అయినా విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కలగనుంది. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టు కింద జమ్ము శ్రీనగర్, కర్నాల్ ప్రాంతాల్లో 49 వేల ఈపీఎస్ పెన్షనర్లకు 11 కోట్ల పెన్షన్ ప్రక్రియ విజయవంతమైంది. ఈ ప్రక్రియ 2025 జనవరి 1 నుంచి దేశమంతా అమలు కానుంది. సీపీపీఎస్ విధానంలో అమల్లోకి వస్తే పెన్షనర్లు ఊరు మారిన ప్రతిసారీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ బదిలీ చేసుకోవల్సిన అవసరం లేదు. దేశంలో ఎక్కడ నుంచైనా తమ పెన్షన్ పొందవచ్చు. ఈపీఎఫ్ఓ రీజనల్ లేదా జోనల్ కార్యాలయాలు దీనికోసం 3-4 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఎలాంటి వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండానే బ్యాంకుల నుంచి పెన్షన్ పొందవచ్చు.
సీపీపీఎస్ విధానం ప్రకారం దేశమంతా పెన్షన్ పంపిణీ ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా జరగనుంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినప్పుడు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ బదిలీ చేసుకోవల్సిన అవసరం ఉండదు. రిటైర్మెంట్ తరువాత తమ సొంత ఊరికి వెళ్లిపోయే పెన్షనర్లకు ఈ ప్రక్రియ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కొత్త ప్రక్రియ ద్వారా 78 లక్షలమంది పెన్షనర్లు లబ్ది పొందనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.