Ex-gratia in Coronavirus cases: కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు కరోనావైరస్‌ను ఒక జాతీయ విపత్తుగా పరిగణిస్తూ జాతీయ విపత్తు నిర్వహణ నిధి కింద ఆర్థిక సహాయం చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన తేల్చిచెప్పింది.

Last Updated : Mar 14, 2020, 04:25 PM IST
Ex-gratia in Coronavirus cases: కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

కరోనావైరస్‌తో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా (Ex-gratia) అందించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. కరోనా వైరస్‌  (Coronavirus)ను చూసి జనం బెంబేలెత్తిపోతున్న తరుణంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు కరోనావైరస్‌ను ఒక విపత్తుగా పరిగణిస్తూ జాతీయ విపత్తు నిర్వహణ నిధి కింద ఆర్థిక సహాయం చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన తేల్చిచెప్పింది.

కరోనావైరస్ సోకి చనిపోయే వారితో పాటు.. కరోనా బాధితులకు సహాయార్థం పనిచేసే విభాగాల వారికి కూడా ఈ ఎక్స్‌గ్రేషియా వర్తించనున్నట్టు కేంద్రం ప్రకటన స్పష్టంచేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News