గుజరాత్ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్‌లో విజేతల ఫలితాలు ఇవే..!

గుజరాత్ ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదల అవుతున్న సందర్భంలో ఇప్పటికే వివిధ పత్రికలు, టీవి ఛానళ్లు, వెబ్‌సైట్లు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించి సర్వే చేయడం గమనార్హం. వీటిని ఒకసారి పరిశీలించే చూస్తే.. గుజరాత్‌లో మోదీ సర్కారే మరల మెజారిటీ సాధించి, కాంగ్రెస్‌కు మంచి పోటీ ఇస్తుందని తెలుస్తోంది.

Last Updated : Dec 17, 2017, 10:51 AM IST
గుజరాత్ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్‌లో విజేతల ఫలితాలు ఇవే..!

గుజరాత్ ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదల అవుతున్న సందర్భంలో ఇప్పటికే వివిధ పత్రికలు, టీవి ఛానళ్లు, వెబ్‌సైట్లు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించి సర్వే చేయడం గమనార్హం.

వీటిని ఒకసారి పరిశీలించే చూస్తే.. గుజరాత్‌లో మోదీ సర్కారే మరల మెజారిటీ సాధించి, కాంగ్రెస్‌కు మంచి పోటీ ఇస్తుందని తెలుస్తోంది. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం కూడా ఉందంటున్నారు  రాజకీయ నిపుణులు

విఎంఆర్ సర్వే  ప్రకారం బీజేపీ 190 సీట్లు గెలుచుకుంటుందని తెలుస్తోంది. అలాగే ప్రతిపక్షం కాంగ్రెస్ 70 సీట్లకే పరిమితం అవుతుందని ఈ సర్వే తెలియజేస్తోంది. మిగతా పార్టీలు 3 సీట్లు గెలవవచ్చని కూడా ఈ పోల్ చెబుతోంది. 

సీఎస్డీఎస్ సర్వే ప్రకారం బీజేపీ మెజారిటీ స్థాయిలో 117 సీట్లు గెలుచుకుంటుందని.. అలాగే కాంగ్రెస్ కేవలం 64 సీట్లకే పరిమితమవుతుందని తెలుస్తోంది. ఇతర పార్టీలు 1 సీటు గెలుచుకొనే అవకాశం ఉందని సీఎస్డీఎస్ చెబుతోంది. దాదాపు బీజేపీ 49 శాతం ఓట్లను కొల్లగొట్టే అవకాశం ఉందని కూడా ఈ సర్వే చెబుతోంది.

సీఎన్‌ఎక్స్ సర్వే ప్రకారం బీజేపీ 110 నుండి 120 సీట్లు పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ 65-75 సీట్లు పొందే అవకాశం ఉంది, ఇతర పార్టీలు 2-4 సీట్లు పొందుతాయని ఈ సర్వే చెబుతోంది. 

ప్రాంతాలవారీగా వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు

ఉత్తర గుజరాత్ -  ఇక్కడ  బీజేపీ 49 శాతం ఓట్లను నమోదు చేసే అవకాశం ఉంది.  ఇక్కడ బీజేపీ 32 నుండి 38 సీట్లను గెలుచుకుంటే, కాంగ్రెస్ 16 నుండి 22 సీట్లు గెలుచుకొనే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ తెలియజేస్తోంది.

దక్షిణ గుజరాత్ -  ఇక్కడ బీజేపీ 52 శాతం ఓట్లను నమోదు చేసే అవకాశం ఉంది.  ఇక్కడ బీజేపీ 21 నుండి 27 సీట్లను గెలుచుకుంటే, కాంగ్రెస్ 9 నుండి 13 సీట్లు గెలుచుకొనే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ తెలియజేస్తోంది.

సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలు - ఇక్కడ బీజేపీ 49 శాతం ఓట్లను నమోదు చేసే అవకాశం ఉంది.  ఇక్కడ బీజేపీ 31 నుండి 37  సీట్లను గెలుచుకుంటే, కాంగ్రెస్ 16 నుండి 22 సీట్లు గెలుచుకొనే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ తెలియజేస్తోంది

మధ్య గుజరాత్ - ఇక్కడ బీజేపీ 47 శాతం ఓట్లను నమోదు చేసే అవకాశం ఉంది.  ఇక్కడ బీజేపీ 21 నుండి 27  సీట్లను గెలుచుకుంటే, కాంగ్రెస్ 13 నుండి 19 సీట్లు గెలుచుకొనే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ తెలియజేస్తోంది

సీఓటర్ సర్వే ప్రకారం బీజేపీ 108 సీట్లు పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ 74 సీట్లు పొందే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతోంది. 

రిపబ్లిక్ టివి సర్వే ప్రకారం మోదీ హవా మళ్లీ గుజరాత్‌లో కొనసాగుతుందని తెలిపింది.

యాక్సిస్ మై ఇండియా పోల్ సర్వే ప్రకారం బీజేపీ 99 నుండి 113 సీట్లు పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ 68 నుండి 82 సీట్లు పొందుతాయని ఈ సర్వే చెబుతోంది. 

ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం తొలిదశలో బీజేపీ 49 నుండి 61 సీట్లు పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ 29 నుండి 37 సీట్లు పొందే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతోంది. 

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు

హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం బీజేపీ హవా కొనసాగనుంది

యాక్సిస్ మై ఇండియా పోల్ సర్వే ప్రకారం బీజేపీ 51 సీట్లు పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ 17 సీట్లు పొందే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతోంది. 

చాణక్య సర్వే ప్రకారం  బీజేపీ 55 సీట్లు పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ 13 సీట్లు పొందే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతోంది. 

విఎంఆర్ సర్వే ప్రకారం  బీజేపీ 42 నుండి 52 సీట్లు పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ 18 నుండి 24 సీట్లు పొందే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతోంది. 

న్యూస్ ఎక్స్ సర్వే  ప్రకారం బీజేపీ 47 నుండి 55  సీట్లు పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ 18 నుండి 24 సీట్లు పొందుతాయని ఈ సర్వే చెబుతోంది. 

సీఓటర్ సర్వే ప్రకారం బీజేపీ 41 సీట్లు పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ 25 సీట్లు, ఇతర పార్టీలు 2 సీట్లు పొందుతాయని ఈ సర్వే చెబుతోంది. 

Trending News