ప్రధాని మోడీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఓ సామాన్యుడు ఛాలెంజ్ చేశాడు. ఒక్క రోజు అయినా పొలంలో రైతులా పని చేయాలని గోవాలోని ఓ గ్రామానికి చెందిన సర్పంచ్ సిద్ధేశ్ భగత్ ఇరువురు నేతలకు సవాల్ విసిరాడు. వ్యవసాయ క్షేత్రంలో నాగలి దున్నాలని, ట్రాక్టర్ నడపాలని, విత్తనాలు చల్లాలని.. రైతులా పని చేయాలని, అప్పుడే, కర్షకులు పడే బాధలేంటో వారికి తెలుస్తాయంటున్నాడు సిద్ధేష్ భగవత్.
మోదీ, రాహుల్ తో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్, విరాట్ కోహ్లీ, ఇతర రాజకీయ నేతలు ఈ ఛాలెంజ్ ను స్వీకరించాలని కోరాడు. కాగా గోవాలోని పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ ఛాలెంజ్ ను స్వీకరించి పొలాల్లోకి దిగారు. అయితే దీనిపై ప్రధాని మోడీ, రాహుల్ గాంధీలు ఎలా స్పందిస్తారనేది గమనార్హం.
ఇటీవలికాలంలో రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు, సెలెబ్రిటీలు ‘ఫిట్ నెస్ ఛాలెంజ్’ లు చేసుకుంటున్న విషయం తెలిసిందే. మోడీ, రాహుల్ గాంధీలే కాదు దీనిపై వీళ్లుందరూ ఏ మేరకు స్పందిస్తారనేది గమనించదగిన విషయం. కాగా ప్రస్తుతం సామాన్యుడు చేసిన ఈ ఛాలెంజ్ సోషల్ మీడియాలో తెర వైరల్ అవుతోంది