Madhyapradesh: చిన్నపిల్లల వార్డులో చెలరేగిన మంటలు...నలుగురు చిన్నారులు మృతి

Fire accident: చిన్నపిల్లల వార్డులో మంటలు చెలరేగి నలుగురు మృత్యువాత పడిన ఘటన భోపాల్‌లోని కమలా నెహ్రూ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2021, 08:26 AM IST
  • భోపాల్‌లో ఘోర ప్రమాదం
  • చిన్నపిల్లల వార్డులో మంటలు
  • నలుగురు చిన్నారులు మృతి
Madhyapradesh: చిన్నపిల్లల వార్డులో చెలరేగిన మంటలు...నలుగురు చిన్నారులు మృతి

Madhyapradesh: మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌(Bhopal)లో ఘోర ప్రమాదం జరిగింది. కమలా నెహ్రూ ఆస్పత్రి(Kamala Nehru Hospital)లోని చిన్న పిల్లల వార్డు (children's ward)లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఘటన జరిగిన సమయంలో వార్డులో 40 మంది చిన్నారులు ఉన్నారు. 36 మంది చిన్నారులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. 

Also Read: Mexico accident: కార్లపైకి దూసుకెళ్లిన ట్రక్కు... 19 మంది దుర్మరణం!

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ (Vishwas Sarang) సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌(CM Shivraj Singh Chouhan) ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. 

మంటలు చెలరేగిన విషయాన్ని తెలుసుకున్న చిన్నారుల కుటుంబీకులు అక్కడికి పరుగులు తీశారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. షార్ట్​ సర్క్యూట్​ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News