First Man ki Baat 2022: ప్రధాని నరేంద్ర మోదీ నేడు (జనవరి 30).. ఈ ఏడాది తొలి 'మన్ కి బాత్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. నేటి మన్ కి బాత్ 85వ ఎడిషన్.
ఆల్ ఇండియా రేడియో వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాగా డీడీ నేషనల్, నరేంద్ర మోదీ మొబైల్ యాప్‌లో సైతం 'మన్ కి బాత్'లో ప్రధాని మోదీ ప్రసంగాన్ని వినొచ్చు.
ఈ కార్యక్రమంలో భాగంగా.. ప్రతి ఒక్కరు నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించాలని ప్రధాని కోరారు.
అత్యంత పరిశుభ్రమైన దేశంగా..
ఇక పరిశుభ్రమైన దేశంగా మారాలనే 'మన్ కి బాత్'తో అసోం బాలిక తనకు రాసిన లేఖను ప్రధాని మోదీ చదివి వినిపించారు. అసోంకు చెందిన 7వ తరగతి విద్యార్థిని రిధిమా.. 'మనం 100వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే సమయానికి అత్యంత పరిశుభ్రమైన దేశంగా భారత్ మారాలని ఆశిస్తున్నట్లు' ఆ లేఖలో రాసిందని చెప్పారు ప్రధాని మోదీ.
ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మరో బాలిక రాసిన లేఖను కూడా మోదీ చదివి వినిపించారు. 2047 నాటికి దేశం అవినీతి రహితంగా మారాలి అనేది ఆ బాలిక కోరిక అనేది చెప్పారు.
అవినీతి అనేది చెద పురుగులాంటిదని అభివర్ణించారు మోదీ. అది దేశాన్ని నాశనం చేస్తుందని చెప్పారు. అందుకే అవినీతి అంతం కోసం 2047 వరరకు ఎందుకు వేచి చూడాలన్నారు. యువత ముందుకొస్తే.. దానిని వీలైనంత త్వరగా పూర్తి చేయొచ్చన్నారు ప్రధాని. విధులకు ప్రధాన్యతనివ్వడం, కర్తవ్యామే మొదటి ప్రాధాన్యతగా ఉన్నచోట అవినీతికి చోటు ఉండదన్నారు.
ఇక కోటికిపైగా పిల్లల తమ 'మన్ కి బాత్'ను పోస్ట్‌కార్డుల ద్వారా పంపారని ప్రధాని మోదీ తెలిపారు.
75 పోస్ట్ కార్డ్‌లు..
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న 'ఆజాది కా అమృత్ మహోత్సవ్'ను ఉద్దేశించి.. క్రొయేషియా నుంచి 75 పోస్ట్‌కార్డ్‌లు వచ్చినట్లు ప్రధాని వివరించారు.
చిరు వ్యాపారికి అభినందనలు..
తమిళనాడుకు చెందిన చిరు వ్యాపారి తాయమ్మల్ గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. కొబ్బరికాయల వ్యాపారంతో తాను దాచుకున్న డబ్బుల్లో స్కూళ్ల కోసం రూ.లక్ష విరాళంగా ఇవ్వడాన్ని ప్రధాని అభినందించారు.
వీటన్నింటితో చాలా విషయాలను ప్రస్తావించారు ప్రధాని మోదీ. అనేక సూచనలు కూడా చేశారు.
Also read: India Corona Cases: దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు... భారీగా మరణాలు నమోదు!!
Also read: Martyrs Day: అమరవీరుల దినోత్సవం ఎప్పుడు, గాంధీ వర్ధంతి రోజునా లేక మార్చ్ 30 వతేదీనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook