Food Poison: మహారాష్ట్ర మద్యాహ్న భోజనం ఫుడ్ పాయిజన్, 61 మంది విద్యార్ధుల పరిస్థితి విషమం

Food Poison: మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. 61 మంది విద్యార్ధులు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలేం జరిగిందంటే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 10, 2023, 06:47 PM IST
  • మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో వికటించిన మద్యాహ్న భోజన పథకం
  • హుతాత్మ రాజ్ గురు విద్యాలయంలో మద్యాహ్నం భోజనం ఫుడ్ పాయిజన్
  • 61 మంది విద్యార్ధులకు తీవ్ర అస్వస్థత, పరిస్థితి విషమం
Food Poison: మహారాష్ట్ర మద్యాహ్న భోజనం ఫుడ్ పాయిజన్, 61 మంది విద్యార్ధుల పరిస్థితి విషమం

మహారాష్ట్రలోని రాజ్ గురునగర్‌లోని ఓ పాఠశాలలో మద్యాహ్న భోజనం వికటించింది. పెద్దఎత్తున వందల సంఖ్యలో విద్యార్ధులు అస్వస్థకు గురయ్యారు. అందులో 61 మంది పరిస్థితి చాలా విషమంగా ఉంది.

మహారాష్ట్ర మద్యాహ్న భోజన పథకం వికటించింది. రాజ్ గురునగర్‌లోని హుతాత్మ రాజగురు విద్యాలయంలో మద్యాహ్నం భోజనం తిన్న విద్యార్ధాలు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ అయినట్టు తెలుస్తోంది. వందల సంఖ్యలో విద్యార్ధులకు ఆరోగ్యం పాడైంది. వికారం, కడుపు నొప్పి రావడంతో తక్షణం సమీపంలోని చందోలి గ్రామీణ ఆసుపత్రిలో చేర్చారు. ఇందులో 61 మంది విద్యార్ధుల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. జిల్లా మెజిస్ట్రేట్త విక్రాంత్ చవాన్, తహశిల్దార్ డాక్టర్ వైశాలి, పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్ తదితరులు విద్యార్ధులు సత్వర చికిత్స అందే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు జరిగిన ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. 24 గంటలు విద్యార్ధుల్ని ఆసుపత్రిలోనే ఉంచుతామన్నారు. 

హుతాత్మ రాజ్‌గురు విద్యాలయంలో 296 మంది విద్యార్ధులు 5 నుంచి 8వ తరగతి చదువుతున్నారు. ఇందులో 61 మంది పరిస్థితి తీవ్రంగా ఉంది. భోజనం చేసేటప్పుడు అన్నంలో సబ్బు వాసన వచ్చిందని తెలిసింది. మద్యాహ్నం రెండున్నర గంటల సమయంలో చాలామంది విద్యార్ధులు ఉన్నట్టుండి..కడుపు నొప్పి, వికారం లక్షణాలతో పడిపోసాగారు. 

Also read: Bank Loan Fraud: తస్మాత్ జాగ్రత్త, మీ పేరుపై మీకు తెలియకుండా ఎవరైనా లోన్ తీసుకున్నారా, ఇలా చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News