Navneet Kaur: కరోనా నుంచి వేగంగా కోలుకుంటున్న నవనీత్ కౌర్

ఎంపీ నవనీత్ కౌర్ రాణా ఆరోగ్యం మెరుగవుతోంది. కరోనా బారి నుంచి వేగంగా కోలుకుంటున్నానని టాలీవుడ్ మాజీ నటి నవనీత్ కౌర్ ( Navneet Kaur Health Condition) తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వీడియో షేర్ చేశారు.

Last Updated : Aug 17, 2020, 04:17 PM IST
  • కరోనా బారి నుంచి వేగంగా కోలుకుంటున్న ఎంపీ నవనీత్ కౌర్ రాణా
  • తన ఆరోగ్య పరిస్థితిపై నటి నవనీత్ కౌర్ వీడియో పోస్ట్
  • పూర్తిగా కోలుకుని మళ్లీ ప్రజాసేవ మొదలుపెడతా: ఎంపీ నవనీత్ కౌర్
Navneet Kaur: కరోనా నుంచి వేగంగా కోలుకుంటున్న నవనీత్ కౌర్

టాలీవుడ్ మాజీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ రాణా (Navneet Kaur) ఆరోగ్యం మెరుగవుతోంది. కరోనా వైరస్ (CoronaVirus) బారి నుంచి తాను వేగంగా కోలుకుంటున్నట్లు మహారాష్ట్ర, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ (Amaravati MP Navneet Kaur) తెలిపారు. దాదాపు 10 రోజుల కిందట ఆమె కుటుంబంలో 12 మంది సభ్యులకు కోవిడ్19 పాజిటివ్‌గా తేలడం కలకలం రేపింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమయింది. Sharad Pawar: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంట్లో కరోనా కలకలం

తన ఆరోగ్య పరిస్థితిపై నటి నవనీత్ కౌర్ వీడియో పోస్ట్ చేశారు. కరోనా నుంచి వేగంగా కోలుకుంటున్నానని, తనను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారని చెప్పారు. కుటుంబసభ్యులు కూడా కరోనా నుంచి కోలుకుంటున్నారని తెలిపారు. అభిమానుల ఆశీస్సులతో, డాక్టర్లు, వైద్య సిబ్బంది చొరవతో ఆరోగ్యం మెరుగుపడిందన్నారు.  COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే 

గత గురువారం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించి నవనీత్ కౌర్‌కు చికిత్స అందిస్తున్నారు. త్వరలోనే పూర్తిగా కోలుకుని మళ్లీ ప్రజాసేవ మొదలుపెడతానని అమరావతి ఎంపీ పేర్కొన్నారు. Dogs to Sniff Out COVID19: కోవిడ్19 నిర్ధారణకు కుక్కలు రిక్రూట్.. ఎక్కడంటే? 
అందాలతో బుసలు కొడుతున్న ‘నాగిని’ Nia Sharma Hot Photos
Photos:
 
అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా.. 

Trending News