Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో నలుగురిని అదుపులో తీసుకున్న ఎన్ఐఏ

Delhi Blast: దేశవ్యాప్తంగా కలవరం కల్గించిన ఢిల్లీ బాంబు పేలుళ్లు విషయంలో కీలకాధారాలు లభ్యమయ్యాయి. దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనుమానితుల ఫుటేజ్ ఆధారంగా నలుగురిని ఎన్ఐఏ అదుపులో తీసుకుంది. కేసు వివరాలిలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 24, 2021, 06:05 PM IST
 Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో నలుగురిని అదుపులో తీసుకున్న ఎన్ఐఏ

Delhi Blast: దేశవ్యాప్తంగా కలవరం కల్గించిన ఢిల్లీ బాంబు పేలుళ్లు విషయంలో కీలకాధారాలు లభ్యమయ్యాయి. దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనుమానితుల ఫుటేజ్ ఆధారంగా నలుగురిని ఎన్ఐఏ అదుపులో తీసుకుంది. కేసు వివరాలిలా ఉన్నాయి.

ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ ఎంబసీ(Izrael Embassy)వద్ద జనవరి 29వ తేదీన చోటుచేసుకున్న పేలుడు (Delhi Blast)కేసులో నలుగురు యువకులను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. హై సెక్యూరిటీ జోన్‌లోని ఏపీజే అబ్దుల్‌ కలాం రోడ్డులో సంభవించిన ఈ ఘటనలో అప్పట్లో ఎవరు గాయపడకపోయినా..ఇజ్రాయిల్ ఎంబసీ కావడంతో సంచలనంగా మారింది. ఆరోజు సాయంత్రం 5 గంటల సమయంలో దౌత్య కార్యాలయం సమీపంలోని ఓ పూలకుండీలో ఉంచిన ఐఈడీ పేలి.. దగ్గర్లో పార్కు చేసిన మూడు కార్ల అద్దాలు పగిలిపోయాయి.

పేలుడు జరిగిన రోజుకు ఇండియా- ఇజ్రాయిల్ ( India-Izrael)మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 29 ఏళ్లు పూర్తయింది. ఇజ్రాయిల్‌కు ప్రత్యేక దేశం గుర్తింపు ఇవ్వడాన్ని నిరసిస్తూ భారీ పేలుడుకు ప్రణాళిక రూపొందించారు.భారీ భద్రత నేపధ్యంలో వ్యూహం ఫలించలేదు. ఈ ఘటనకు సంబంధించి ఆ ప్రాంతంలో అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు అనుమానితుల పుటేజిని ఈ మధ్యనే ఎన్ఐఏ (NIA)విడుదల చేసింది. ఈ ఫుటేజి ఆధారంగా నలుగురిని అదుపులో తీసుకుని విచారిస్తోంది.

Also read: Reliance JioPhone Next 4G smartphone: రిలయన్స్ నుంచి Google సపోర్టుతో పనిచేసే జియోఫోన్ నెక్ట్స్ 4G స్మార్ట్‌ఫోన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News