Daughters: అంత్యక్రియలకు కుమారులు దూరం.. తల్లి మృతదేహాన్ని 4 కిలోమీటర్లు మోసిన కుమార్తెలు! కారణం ఏంటంటే?

ఓ నలుగురు మహిళలు తమ తల్లి మృతదేహాన్ని 4 కిలోమీటర్లు భుజాలపై మోసుకుని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2022, 06:42 PM IST
  • తల్లి అంత్యక్రియలకు కుమారులు దూరం
  • తల్లి మృతదేహాన్ని 4 కిలోమీటర్లు మోసిన కుమార్తెలు
  • ఆహారం, డబ్బు ఇచ్చేవారు కాదు
Daughters: అంత్యక్రియలకు కుమారులు దూరం.. తల్లి మృతదేహాన్ని 4 కిలోమీటర్లు మోసిన కుమార్తెలు! కారణం ఏంటంటే?

Four Women carried the body of their mother and performed her last rites After Sons Skip Funeral: పాతకాలపు సంప్రదాయాలు మరియు లింగ మూఢాచారాలను ఉల్లంఘిస్తూ.. ఓ నలుగురు మహిళలు (Four Women) తమ తల్లి మృతదేహాన్ని 4 కిలోమీటర్లు భుజాలపై మోసుకుని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. తల్లి చివరి చూపుకు కూడా సోదరులు రాకపోవడంతో వారే అంత్యక్రియలు (Funeral) నిర్వహించారు. ఈ విషాద ఘటన ఒడిశా (Odisha) పూరీలోని మంగళఘాట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. నలుగురు మహిళలు తమ తల్లి మృతదేహాన్ని రోడ్డుపై మోసుకెళ్లిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఓ జాతీయ మీడియా వివరాల ప్రకారం... మంగళఘాట్ ప్రాంతంకు చెందిన జతి నాయక్ (Jati Nayak) అనే మహిళకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. కుమార్తెలకు వివాహం కాగా.. కుమారులు ఇద్దరు విడివిడిగా నివసిస్తున్నారు. గత పది సంవత్సరాలుగా జతి నాయక్ ఒక్కరే జీవనం కొనసాగిస్తున్నారు. ఆమెను తమ కుమారులు ఏనాడు పట్టించుకోలేదు. ఆహారం, డబ్బు కూడా ఇచ్చేవారు కాదు. కనీసం బాగా ఉన్నారా లేదా అని కూడా చూసేవారు కాదు. ఇటీవల జతి నాయక్ ఒకసారి అనారోగ్యానికి గురైనా ఇద్దరు కుమారులు ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. 

Also Read: Harnaaz Sandhu NYC Apartment: న్యూయార్క్ లోని మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు ఇల్లు చూశారా?

అనారోగ్యం పాలైన జతి నాయక్ గత ఆదివారం మరణించారు. ఇద్దరు కుమారులు ఎవరూ తమ తల్లిని కడచూపు చూసేందుకు రాలేదు. అంతేకాదు అంత్యక్రియలు (Jati Nayak Funeral) కూడా చేయమని చెప్పారు. దాంతో జతి నాయక్ నలుగురు కుమార్తెలు అంత్యక్రియలు చేయాలని నిర్ణయించుకున్నారు. వారికి ఇరుగుపొరుగు వారు సహాయం చేశారు. నలుగురు కుమార్తెలు తమ తల్లి మృతదేహాన్ని భుజాన వేసుకుని (Four Women Carried Her Mother Body) 4 కిలోమీటర్ల దోరంలో ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. 

Also Read: BAN vs NZ: న్యూజిలాండ్‌ గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రక విజయం.. డ్రెస్సింగ్ రూమ్‌లో రచ్చచేసిన ప్లేయర్స్ (వీడియో)!!

జతి నాయక్ తన భర్త మరణం అనంతరం వీధి వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించారు. ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలను ఎంతో బాగా చూసుకున్నారు. కుమారులు మాత్రం ఆమెను పట్టించుకోలేదు. సోదరులు తల్లిని నిత్యం హింసించేవారని కుమార్తెలు తెలిపారు. 'గత పదేళ్లుగా మా సోదరులు అమ్మను నిర్లక్ష్యం చేశారు. అమ్మను తమతో ఉండడానికి ఎప్పుడూ అనుమతించలేదు. ఇన్ని సంవత్సరాల్లో అమ్మ ఆహారం గురించి కూడా పట్టించుకోలేదు. మరణానికి ముందు అమ్మ ఒకసారి అనారోగ్యానికి గురైంది. మేము అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లినా మా సోదరులు రాలేదు' అని నలుగురు కుమార్తెలలో ఒకరైన సీతామణి సాహు (Seethamani Sahu) చెప్పారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News