Fourth Wave Scare: దేశంలో స్థిరంగా కరోనా వ్యాప్తి... కొత్త కేసులు ఎన్నంటే?

Covid-19 Update: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 16, 678 కరోనా కేసులు వెలుగు చూశాయి. మహమ్మారితో మరో 26 మంది ప్రాణాలు విడిచారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 11, 2022, 10:19 AM IST
  • దేశంలో కరోనా విజృంభణ
  • కొత్తగా కేసులు 16వేలకు పైగా
  • రోజువారీ పాజిటివ్ రేటు 5.99 శాతం
Fourth Wave Scare: దేశంలో స్థిరంగా కరోనా వ్యాప్తి... కొత్త కేసులు ఎన్నంటే?

India Corona Cases: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్తగా 16, 678 కరోనా కేసులు (Corona cases in India) నమోదయ్యాయి. వైరస్ తో మరో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి మరో 14,629 మంది రికవరీ అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,30,713 యాక్టివ్ కేసులు ఉన్నాయి, రోజువారీ పాజిటివీ రేటు 5.99 శాతానికి పెరిగింది. నిన్న మరో 2,78,266 మందికి కరోనా టెస్టులు చేశారు. 

దేశంలో మెుత్తం కరోనా కేసుల సంఖ్య 43,639,329గా.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 4,29,83,162 కాగా... మెత్తం మరణాల సంఖ్య 525454 గా ఉంది. భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ (Covid-19 Vaccination in India) కార్యక్రమం స్థిరంగా కొనసాగుతోంది. నిన్న 11,44,145 మందికి కరోనా టీకాలు అందించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు పంపిణీ చేసిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,98,88,77,537గా నమోదైంది. 

వరల్డ్ వైడ్ గా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 4,11,725 మందికి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైరస్ తో 584 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఇటలీలో కరోనా కోరలు చాస్తోంది. కొత్తగా 79,920 మందికి వైరస్ సోకగా.. మరో 44 మంది మహమ్మారితో మరణించారు. 

Also Read: JEE Main Result 2022: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు విద్యార్థులు! 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News