గ్యాస్ ట్యాంకర్‌ని ఢీకొన్న మరో ట్యాంకర్.. 5 వాహనాలు దగ్ధం!

వేర్వేరు ప్రమాదాలతో రక్తమోడీని యమునా ఎక్స్‌ప్రెస్ వే

Last Updated : Oct 28, 2018, 03:32 PM IST
గ్యాస్ ట్యాంకర్‌ని ఢీకొన్న మరో ట్యాంకర్.. 5 వాహనాలు దగ్ధం!

రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ గ్యాస్ ట్యాంకర్ మరో గ్యాస్ ట్యాంకర్‌ని ఢీకొని పేలుడు చోటుచేసుకున్న ఘటనలో మరో 5 వాహనాలు దగ్ధమయ్యాయి. శనివారం రాత్రి ఉత్తర్ ప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్ వేపై మధురకు సమీపంలోని సురిర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ట్యాంకర్‌ని ఢీకొని పేలుడు జరగగా అప్పుడు ఆ రెండు వాహనాలకు సమీపంలోనే ఉన్న మరో 5 వాహనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది పైర్ ఇంజిన్లతో అక్కడికి చేరుకునే లోపే వాహనాలన్ని అగ్నికి ఆహుతయ్యాయి.

ఇదిలావుంటే, ఇదే యమునా ఎక్స్‌ప్రెస్‌పై అలీఘర్ జిల్లా తప్పల్ వద్ద చోటుచేసుకున్న మరో రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. ఢిల్లీ నుంచి ఆగ్రాకు వెళ్తున్న టూరిస్ట్ బస్సును వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.  

 

Trending News