Goa Election Results 2022: గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ ఉన్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 13 స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. ఈసారి ఆ మార్క్‌ను దాటే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో గోవా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. మంత్రి, ఆ పార్టీ నేత విశ్వజిత్ రాణే తాజా ఫలితాలపై సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
రాణే గురువారం (మార్చి 10) ఉదయం వాల్పొయి అసెంబ్లీ నియోజకవర్గంలోని కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించారు. అప్పటికే ఆయన 7వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వ్యక్తిగతంగా తాను ఆధిక్యంలో ఉండటం.. పార్టీ కూడా ఆధిక్యంలో దూసుకెళ్తుండటంతో సంతోషంతో ఆయన కళ్లు చెమర్చాయి.
ఈ సందర్భంగా రాణే మాట్లాడుతూ.. 'ఈ క్రెడిట్ అంతా ప్రధాని మోదీకే దక్కుతుంది. గోవా కోసం ఆయన ఎంతో చేశారు. ఇది ప్రజల విజయం.. బీజేపీ నాయకత్వం సాధించిన విజయం. కాంగ్రెస్, ఇతర పార్టీలు ప్రజలను ఫూల్స్‌ను చేశాయి. బీజేపీ మాత్రం ప్రజల అభివృద్ది కోసం కృషి చేసింది.' అని పేర్కొన్నారు. గోవాలో ఈసారి కూడా తమదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. రాణే భార్య దేవియా కూడా ప్రస్తుతం 13 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆమె పొరియెం నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు.
కాగా, గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మేజిక్ ఫిగర్ 21. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా తక్కువ సీట్లే సాధించినప్పటికీ ఇతర పార్టీల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజా ట్రెండ్స్‌లో బీజేపీ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో మేజిక్ ఫిగర్‌కి చేరువగానే ఉంది. ఇతర పార్టీల మద్దతు కూడగట్టగలిగితే గోవాలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమనే చెప్పాలి.
Also Read: UP Election Result: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కమలం దూకుడు.. సంబురాలు ప్రారంభించిన బీజేపీ కార్యకర్తలు!
Also Read: Punjab Election Results 2022: పంజాబ్‌లో ఆప్ విజయానికి కారణాలేంటి, కాంగ్రెస్ పతనానికి మూలమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook