స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Updated: Apr 23, 2019, 11:15 PM IST
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Representational image

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్చత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.100 మేర తగ్గి రూ.32,770కు చేరుకుంది. ఇక 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా అదే విధంగా రూ. 100 తగ్గి రూ.32,600 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరల విషయానికొస్తే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,680కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,170 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధరలు కూడా కిలోకు రూ.145 మేర క్షీణించి రూ.38,425కు తగ్గింది. పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడమే వెండి ధరలు తగ్గడానికి కారణమైనట్టు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

జువెల్లర్లు, స్థానిక వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గిన కారణంగానే దేశీ మార్కెట్‌లో బంగారం ధరల్లో స్వల్ప మోతాదులో తగ్గుదల నమోదైనట్టు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.