Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

కరోనా వ్యాప్తి సమయంలోనూ బులియన్ మార్కెట్‌లో జోష్ కనిపిస్తోంది. బంగారం (Gold Rate Today In Hyderabad), వెండి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇదివరకే బులియన్ మార్కెట్ చరిత్రలోనే అధిక ధరల్ని కొన్ని రోజుల కిందట బంగారం, వెండి నమోదు చేయడం తెలిసిందే.

Last Updated : Sep 16, 2020, 07:21 AM IST
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) భారీగా పెరుగుతున్నాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తూ ధర పుంజుకుంది. హైదరాబాద్‌ (Gold Rate Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.490 మేర భారీగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,020కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.450 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.49,520 అయింది. Bigg Boss 4 Voting Numbers: మీ ఫెవరెట్ కంటెస్టెంట్స్‌ ఓటింగ్ నెంబర్స్ ఇవే...

ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారానికి (Gold Rate in Delhi) మళ్లీ డిమాండ్ పెరిగింది. తాజాగా రూ.490 మేర భారీగా ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,030 చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.450 పెరగడంతో ధర రూ.50,450కి పుంజుకుంది. CSK In IPL 2020: సీఎస్కేను వీడని కరోనా కష్టాలు

బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) భారీగా పెరిగింది. తాజాగా రూ.1200 మేర భారీగా ధర పెరగడంతో.. 1 కేజీ వెండి ధర రూ.69,500 అయింది. దేశ వ్యాప్తంగా వెండి ధర ఈ ధర వద్ద మార్కెట్ అవుతుంది. Purple Cap Winners of IPL: మ్యాచ్‌లు మలుపుతిప్పిన బౌలర్లు వీరే..

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News