నగదు రహిత లావాదేవీలపై 2 శాతం డిస్కౌంట్

Last Updated : Aug 29, 2017, 02:33 PM IST
నగదు రహిత లావాదేవీలపై 2 శాతం డిస్కౌంట్

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా మోడీ సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ చర్యలో భాగంగా డిజిటల్ లావాదేవీలపై జీఎన్టీ పన్ను తగ్గించే అంశంపై కసరత్తు చేస్తోంది. రూ.2 వేల కంటే అధికమొత్తంలో కొనుగోలు చేసిన వారికి 2 శాతం పన్ను మినహాయింపు ఇచ్చే ప్రతిపాదనలను ఆర్ధికశాఖ సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. అయితే నేరుగా డిస్కౌంట్ ప్రకటించాలా లేదా క్యాష్ బ్యాక్ రూపంలో ఇవ్వాలా అనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజా ప్రతిపాదనపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆర్బీఐ, ఐటీ శాఖలను ఆర్ధికశాఖ కోరినట్లు సమాచారం. ఆయా శాఖల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం దీనిపై ప్రకటన వెలువడే అవకాశముంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఆన్ లైన్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజా ప్రతిపాదన అమల్లోకి వస్తే డిజిటల్ లావాదేవీలు చేసే వారిపై కొంత మేర జీఎన్టీ భారం తగ్గునుందన్న మాట..!

 

Trending News