Gujarat: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ వేదికపై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించి..సభలన్నింటినీ రద్దు చేశారు.
గుజరాత్ ( Gujarat ) రాష్ట్రంలో ఈ నెల 21వ తేదీన వడోదర సహా ముఖ్యమైన ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 28న మిగిలిన మున్సిపాలిటీలు, జిల్లాలు, తాలూకా పంచాయితీల ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్బంగా అధికార, ప్రతిపక్షపార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వడోదర ( Vadodara )లోని నిజాంపురలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (Gujarat cm vijay rupani ) పాల్గొన్నారు. వేదికపై ప్రసంగిస్తున్న సందర్బంగా ఒక్కసారిగా ఉన్నట్టుంది కుప్పకూలారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది పూర్తిగా పడిపోకుండా పట్టుకున్నారు. వైద్య సిబ్బంది తక్షణం ప్రాధమిక చికిత్స అందించి..అహ్మదాబాద్ ఆసుపత్రికి హెలీకాప్టర్ లో తరలించారు. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పాల్గొనాల్సిన సభలన్నింటినీ తక్షణం రద్దు చేశారు.
గత కొద్దిరోజులుగా విశ్రాంతి లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉండటం వల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. 64 ఏళ్ల వయస్సులో విశ్రాంతి లేకుండా ఎన్నికల ర్యాలీలు నిర్వహించడం వల్లన బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయి నీరసించిపోయారని వైద్యలు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు కొద్దిరోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Pm Narendra modi ) విజయ్ రూపానీ ఆరోగ్యంపై ఆరా తీశారు.
Also read: India post payments bank: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతా ఎలా తెరవాలి..ప్రయోజనాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Gujarat:వేదికపై ప్రసంగిస్తూనే..కుప్పకూలిన ముఖ్యమంత్రి విజయ్ రూపానీ
ఎన్నికల సభలో ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ
వడోదర నిజాంపుర సభలో జరిగన ఘటన, ప్రాధమిక చికిత్స అనంతరం అహ్మదాబాద్ ఆసుపత్రికి తరలింపు
గుజారాత్ మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉంటున్న ముఖ్యమంత్రి విజయ్ రూపానీ