Gyanvapi Case Updates: ఉత్తరప్రదేశ్‌లోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మసీదులో వారణాసి కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ్టి నుంచి ప్రారంభమైన పురావస్తు శాఖ సర్వేను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ ఆదేశాలు జారీ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విశ్వనాధుని ఆలయం, జ్ఞానవాపి మసీదు పక్కపక్కనే ఆనుకుని ఉంటాయి. గతంలో హిందూ ఆలయం ఉన్న ప్రాంతంలో మొఘల్ చక్రవర్తుల కాలంలో జ్ఞానవాపి మసీదు నిర్మించారనేది వివాదం. అందుకే పురావస్తు శాఖతో కార్బన్ డేటింగ్ పరీక్షలు నిర్వహించాలని కోరుతూ హిందూ వర్గాలు చేసిన వాదనకు అనుగుణంగా వారణాసి కోర్టు సర్వేకు ఆదేశించింది. ఈ సర్వే ఇవాళ ప్రారంభమైంది. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ ఉదయం సర్వే ఉంటుందని వారణాసి కలెక్టర్ స్పష్టం చేశారు. 40 మంది పురావస్తు అదికారులు, పోలీసులు లోపలకు ప్రవేశించారు. సుప్రీంకోర్టు గత ఆదేశాల మేరకు సీజ్ చేసిన వజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మిగిలిన ప్రాంతంలో సర్వే ప్రారంభించారు.
ఈలోగా వారణాసి కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మసీదు మేనేజ్‌మెంట్ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ప్రతివాదుల వాదన వినేంతవరకూ సర్వేపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జూలై 26 వతేదీ సాయంత్రం 5 గంటల వరకూ సర్వే ఆపేయాలని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశించారు. వారణాసి కోర్టు ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించాలని కూడా మసీదు కమిటీకు సుప్రీంకోర్టు సూచించింది.
మసీదులోని వజూఖానాలో బయటపడిన ఆకారం శివలింగమని హిందూవులు, కాదు నీటి కొలను నిర్మాణమని ముసీదు కమిటీ వాదించుకుంటున్నాయి. జ్ఞానవాపి మసీదు సైతం కాశీ విశ్వనాధ్ ఆలయంలో భాగమని, మసీదు గోడలపై హిందూ దేవతా మూర్తుల విగ్రహాలున్నాయనేది హిందూవుల వాదన.
క్రీస్తుశకం 1500 సంవత్సరం నుంచి అక్కడ మసీదు ఉన్నప్పుడు ఈ విషయంలో అంత తొందరెందుకని, దీనిపై స్టేటస్ కో ఉండాలని జ్ఞానవాపి మసీదు కమిటీ సుప్రీంకోర్టులో వాదించింది. దీనిపై జూలై 26న విచారణ జరిగే వరకూ స్టేటస్ కో విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో ఇవాళ్టి సర్వే నిలిచిపోయింది.
Also read: Karnataka Girl Video: వాష్‌రూమ్‌లో అమ్మాయి వీడియో తీసిన తోటి విద్యార్థునులు.. తరువాత ఏం చేశారంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Gyanvapi Case Updates: జ్ఞానవాపి మసీదులో నిలిచిన సర్వే, జూలై 26 వరకూ స్టే