Karnataka News: ఓ కాలేజీలో ముగ్గురు విద్యార్థినులు రెస్ట్‌రూమ్‌లో తోటి విద్యార్థిని వీడియో తీసిన ఘటన కలకలం రేపుతోంది. దీంతో ముగ్గురు విద్యార్థులను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. బుధవారం ఈ ఘటన జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా.. ఉడుపిలో ఆప్టోమెట్రీ కోర్సు అభ్యసిస్తున్న ముగ్గురు అమ్మాయిలు.. రెస్ట్ రూమ్‌లోకి తోటి విద్యార్థిని వెళ్లగా సైలెంట్‌గా వీడియో తీశారు. ఇతర అమ్మాయిల వీడియో తీయబోయి.. పొరపాటున వీడియో తీశామంటూ బాధితురాలికి ఆ ముగ్గురు అమ్మాయిలే చెప్పారు. అనంతరం ఆ విద్యార్థిని ఎదురుగానే అందులో వీడియోను డిలీట్ చేశారు.
ఈ విషయాన్ని బాధితురాలు తన ఫ్రెండ్స్ వద్ద చెప్పుకుంది. జరిగిన తప్పిదాన్ని వాళ్లు కాలేజీ యాజమాన్యం దృష్టికి వెళ్లారు. దీంతో మరుసటి రోజే వీడియో తీసిన ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేసింది. నేత్ర జ్యోతి కళాశాల డైరెక్టర్ రష్మీ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. వీడియో తీసిన మరుసటి రోజే విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. బాలికలను రెండు విధాలుగా సస్పెండ్ చేశామని చెప్పారు. ముందుగా కాలేజీలోకి అనుమతి లేకుండా మొబైల్ ఫోన్ తీసుకువచ్చారని.. విద్యార్థిని వీడియో తీయడం సస్పెన్షన్‌కు మరో కారణం అని వెల్లడించారు.
"మేము ముగ్గురు అమ్మాయిలను వెంటనే సస్పెండ్ చేశాం. కొన్ని కారణాల వల్ల బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇష్టపడలేదు. మేము ఈ సంఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాం. వీడియో తీసిన మొబైల్ ఫోన్‌లను కూడా ఫోరెన్సిక్ పరీక్ష కోసం ఇచ్చాం" అని రష్మీ పీటీఐతో చెప్పారు. ఈ విషయంపై మల్పే స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను సంప్రదించగా.. తమకు ఫిర్యాదు అందిందని ధృవీకరించారు. ఫిర్యాదును పరిశీలిస్తున్నామని తెలిపారు.
Also Read: Bank Holiday August 2023: ఆగస్టు నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదే..!
Also Read: CM Jagan Mohan Reddy: రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేకతంగా నిలిచిపోయే రోజు: సీఎం జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి