H3N2 Virus In India 2023: హెచ్‌3ఎన్‌2 ప్రభావం.. మార్చి 16 నుంచి 24 వరకు పాఠశాలలకు సెలవులు!

Puducherry schools closed after H3N2 Influenza Virus cases increse. హెచ్‌3ఎన్‌2 కేసుల సంఖ్య పెరగడంతో పాఠశాలలను మార్చి 10 నుంచి  26 వరకు మూసివేస్తున్నట్లు పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి ప్రకటించారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Mar 15, 2023, 03:25 PM IST
  • హెచ్‌3ఎన్‌2 ప్రభావం
  • మార్చి 16 నుంచి 24 వరకు పాఠశాలలకు సెలవులు
  • దేశ వ్యాప్తంగా 451 హెచ్‌3ఎన్‌2 కేసులు
H3N2 Virus In India 2023: హెచ్‌3ఎన్‌2 ప్రభావం.. మార్చి 16 నుంచి 24 వరకు పాఠశాలలకు సెలవులు!

Puducherry schools closed after H3N2 Influenza Virus cases increse: హెచ్‌3ఎన్‌2 వైరస్ దేశంలోని చాలా చోట్ల విజృంభిస్తోంది. ఈ వైరస్ వల్ల ఇన్‌ఫ్లుయెంజా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. హెచ్‌3ఎన్‌2 వైరస్ క్రమంగా విజృంభిస్తుండటంతో జనాలు మరోసారి కలవరపడుతున్నారు. వైరస్ నేపథ్యంలో పుదుచ్చేరి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 10 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. పుదుచ్చేరిలోని అన్ని స్కూళ్లలో 8వ తరగతి వరకు  సెలవులు ప్రకటిస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ వెల్లడించింది. 2023 మార్చి 16 నుంచి 24వ తేదీ వరకు పుదుచ్చేరిలో పాఠశాలలకు సెలవులు ఉన్నాయి. 

Puducherry Shuts Schools:
ఇన్‌ఫ్లుయెంజా కేసుల సంఖ్య పెరగడంతో పాఠశాలలను 2023 మార్చి 10 నుంచి 26 వరకు మూసివేస్తున్నట్లు పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి నమశ్శివాయం ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆయన  వెల్లడించారు. మార్చి 16 నుంచి 10 రోజుల పాటు 24వ తేదీ వరకు 1-8 తరగతి విద్యార్థులకు సెలవులు ఇచ్చామని పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. 

H3N2 Cases in Puducherry:
పుదుచ్చేరిలో 2023 మార్చి 11 నాటికి 79 ఇన్‌ఫ్లుయెంజా కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్‌ కారణంగా పుదుచ్చేరిలో ఇప్పటివరకు మరణాలు మాత్రం సంభవించలేదు. కేసుల సంఖ్య పెరిగితే.. చికిత్స అందించేందుకు ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే పుదుచ్చేరి విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 

H3N2 Cases in India:
కరోనా వైరస్ తరహా లక్షణాలున్న ఇన్‌ఫ్లుయెంజా (Influenza) కేసులతో శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడి ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పంచుకున్న డేటా ప్రకారం.. 2023 జనవరి 2 నుంచి మార్చి 5వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా 451 హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఇన్‌ఫ్లుయెంజా కారణంగా పలు రాష్ట్రాల్లో మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మొదటి మరణం కర్ణాటకలోని హసన్ జిల్లాలో నమోదైంది. H3N2 వైరస్ కారణంగా 82 ఏళ్ల వ్యక్తి మరణించాడు. గుజరాత్‌లో H3N2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌తో మొదటి మరణం నమోదైంది. 

H3N2 Symptoms: 
H3N2 ఫ్లూ లక్షణాలు దాదాపుగా Coronavirus మాదిరిగానే ఉంటాయి. శరీర నొప్పులు, జ్వరం, చలి, అలసట, వాంతులు, దగ్గు, గొంతు నొప్పి, జలుబు, ముక్కు నుంచి నీరు కారటం మరియు తలనొప్పి ఉంటాయి. ఇన్‌ఫ్లుఎంజా సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా మాట్లాడేటప్పుడు పడిన తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. ఇది అంటువ్యాధి. గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు మరియు ఇతర వైద్య సమస్యలు ఉన్న వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Also Read: IND Playing XI vs AUS: రోహిత్ శర్మ ఔట్.. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్! ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు భారత జట్టు ఇదే

Also Read: Hyundai Creta Price 2023: కేవలం 4 లక్షలకే హ్యుందాయ్ క్రెటా.. ఈ అవకాశం మళ్లీమళ్లీ రాదు! వెంటనే కోనేయండి   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News