కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్థిక్ పటేల్.. లోక్ సభ టికెట్ రెడీ ?

కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్థిక్ పటేల్.. లోక్ సభ టికెట్ రెడీ!

Last Updated : Mar 13, 2019, 08:24 AM IST
కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్థిక్ పటేల్.. లోక్ సభ టికెట్ రెడీ ?

అహ్మెదాబాద్: పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించాల్సిందిగా కోరుతూ ఉద్యమాలు చేసిన పటేల్ సామాజికవర్గం నేత హార్థిక్ పటేల్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అహ్మెదాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ హార్థిక్ పటేల్‌కి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. హార్థిక్ పటేల్‌కి జామ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించేందుకు పార్టీ ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది.

Trending News