ఈ రాజకీయాలు నాకొద్దు: కుమారస్వామి

ఈ రాజకీయాలు నాకొద్దు: కుమారస్వామి

Last Updated : Aug 3, 2019, 11:10 PM IST
ఈ రాజకీయాలు నాకొద్దు: కుమారస్వామి

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఇక రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్టు కుమారస్వామి ప్రకటించడం ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో చర్చనియాంశమైంది. కర్ణాటక అసెంబ్లీలో గత వారం జరిగిన బల పరీక్షలో ఓటమిపాలైన సంకీర్ణ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడంతో కుమారస్వామి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత రాజకీయాల తీరుపై తీవ్ర అసంతృప్తి చెందిన కుమారస్వామి ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

అనుకోకుండానే రాజకీయాల్లోకి వచ్చానన్న కుమారస్వామి.. అనుకోకుండానే రాష్ట్ర ముఖ్యమంత్రిని అయ్యానని అన్నారు. ఆ భగవంతుడు తనకు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అందించాడని కుమారస్వామి పేర్కొన్నారు. ఈరోజుల్లో రాజకీయాలు మంచివారి కోసం కాదని, కులరాజకీయాలు చేసేవారికి అవి పనికొస్తాయని అసహనం వ్యక్తంచేశారు. అటువంటు కులరాజకీయాల్లోకి తన కుటుంబాన్ని లాగడం తనకు ఇష్టం లేదని కుమారస్వామి స్పష్టంచేశారు. ఎవరినో సంతృప్తిపరిచేందుకు తాను రాజకీయాల్లో కొనసాగడం లేదని.. తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన 14నెలలు ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసమే కృషి చేశానని కుమారస్వామి అభిప్రాయపడ్డారు.

Trending News