Heavy Rains in Delhi: ఢిల్లీలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న దేశ రాజధాని

Heavy Rains in Delhi: ఇప్పటికే ఢిల్లీలో కురుస్తోన్న భారీ వర్షాలతో దేశ రాజధాని వరదల్లో చిక్కుకోగా.. ఢిల్లీకి భారీ వరద ముంపు పొంచి ఉందని ఢిల్లీ సర్కారు ఆదివారం హెచ్చరికలు జారీచేసింది. హర్యానాలో భారీ వర్షాలు పడుతుండటంతో అక్కడి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు పోటెత్తుతోంది.

Written by - Pavan | Last Updated : Jul 10, 2023, 12:35 PM IST
Heavy Rains in Delhi: ఢిల్లీలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న దేశ రాజధాని

Heavy Rains in Delhi: ఇప్పటికే ఢిల్లీలో కురుస్తోన్న భారీ వర్షాలతో దేశ రాజధాని వరదల్లో చిక్కుకోగా.. ఢిల్లీకి భారీ వరద ముంపు పొంచి ఉందని ఢిల్లీ సర్కారు ఆదివారం హెచ్చరికలు జారీచేసింది. హర్యానాలో భారీ వర్షాలు పడుతుండటంతో అక్కడి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టుల్లోని నీరు దిగువకు వదులుతున్నారు. ముఖ్యంగా హత్నికుండ్ బ్యారేజీ నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని యమునా నదిలోకి విడుదల చేశారు. దీంతో యమునా నదిలో సైతం వరద ఉధృతి పెరిగింది. ఈ కారణంగానే ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉంది అని ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ వాసులను హెచ్చరించింది. 

ఆదివారం సాయంత్రం 4 గంటలకు హత్నికుండ్ బ్యారేజీ నుంచి 1,05,453 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయిందని నీటిపారుదల, వరద నియంత్రణ శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ నుంచి యమునా నదిలోకి విడుదల చేసిన నీరు ఢిల్లీకి చేరుకోవడానికి మరో రెండు లేదా మూడు రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని సంబంధిత అధికారులు స్పష్టంచేశారు. సాధారణంగా హత్నికుండ్ బ్యారేజీ వద్ద 352 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. నది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల నదిలో వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. 

యమునా నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సహాయ కార్యక్రమాల నిమిత్తం నది పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో క్విక్ రెస్పాన్స్ బృందాలను నియమించారు. రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం సెంట్రల్ కంట్రోల్ రూమ్‌తో సహా 16 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. 

తాజా పరిస్థితులపై సమీక్ష చేపట్టిన సెంట్రల్ వాటర్ కమిషన్.. ఢిల్లీలో యమునా నదిలో నీటిమట్టం పెరుగుతోందని, మంగళవారం నాటికి 205.33 మీటర్ల ప్రమాదకర స్థాయిని మించి ప్రవహించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ అందించిన సమాచారం ప్రకారం, పాత రైల్వే వంతెన వద్ద నీటి మట్టం ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకు 203.18 మీటర్ల ప్రమాదకర స్థాయికి చేరుకుంది. 

ఇది కూడా చదవండి : Heavy Rains Alert: ఉత్తరాది భారీ వర్షాలకు ఇళ్లు, మార్కెట్లు, వంతెనలు అన్నీ ధ్వంసం

ఢిల్లీలో పాఠశాలలకు సెలవులు 
ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరద ముంపు పొంచి ఉన్న నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని విద్యా సంస్థలకు సోమవారం సెలవు ఉంటుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆదివారం ఉదయం 8:30 గంటల వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం గత 24 గంటల వ్యవధిలో ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 తర్వాత జూలై నెలలో ఒకే రోజులో అత్యధిక వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి అని భారత వాతావరణ శాఖ స్పష్టంచేసింది.

ఇది కూడా చదవండి : North India Rain Fury: ఉత్తర భారతాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు... పలువురు మృత్యువాత..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x