PM Modi Foreign Trips: ప్రధాని మోదీ విదేశీ పర్యటనల కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా ?

PM Modi Foreign Trips Budget: గత నాలుగేళ్లలో ప్రధాని మోదీ ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారు, ప్రధాని మోదీ విదేశీ పర్యటనల కోసం ఎంత ఖర్చు అయింది అనే వివరాలను స్వయంగా భారత ప్రభుత్వమే వెల్లడించింది. రాజ్యసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు బదులుగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ గురువారం రాజ్యసభలో రాతపూర్వకంగా ఈ వివరాలు వెల్లడించారు.

Written by - Pavan | Last Updated : Feb 2, 2023, 06:40 PM IST
PM Modi Foreign Trips: ప్రధాని మోదీ విదేశీ పర్యటనల కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా ?

PM Modi Foreign Trips Budget: వివిద దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించడంతో పాటు విదేశాల్లో జరిగే వివిధ సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ విదేశాలకు వెళ్తుంటారు కదా.. అలా రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తరువాత గత నాలుగేళ్లలో ప్రధాని మోదీ ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారు, ప్రధాని మోదీ విదేశీ పర్యటనల కోసం ఎంత ఖర్చు అయింది లాంటి సందేహాలు మీకు ఎప్పుడైనా వచ్చాయా ? వచ్చే ఉంటాయి కదా.. అయితే, ఇదిగో ఈ డీటేల్స్ మీ కోసమే. 

2019 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ 21 విదేశీ పర్యటనలు చేశారు. అందుకోసం భారత ప్రభుత్వం ఇప్పటివరకు రూ.22.76 కోట్లు ఖర్చు చేసింది. అలాగే భారత్ ప్రెసిడెంట్ 8 విదేశీ పర్యటనలు చేయగా.. అందుకోసం రూ. 6.24 కోట్లు ఖర్చయింది. ఈ వివరాలను స్వయంగా భారత ప్రభుత్వమే వెల్లడించింది. రాజ్యసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు బదులుగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ గురువారం రాజ్యసభలో రాతపూర్వకంగా ఈ వివరాలు వెల్లడించారు.

విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ చెప్పిన వివరాల ప్రకారం ప్రధాని మోదీ విదేశీ పర్యటనల కోసం అక్షరాల రూ. 22,76,76,934 కోట్లు ఖర్చు కాగా ప్రెసిడెంట్ విదేశీ పర్యటనల కోసం రూ. 6,24,31,424 ఖర్చయింది. అదే సమయంలో విదేశాంగ శాఖ మంత్రి విదేశీ పర్యటనల కోసం రూ. 20,87,01,475 వెచ్చించారు.  2019 నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ 21 సందర్భాల్లో, ప్రెసిడెంట్ ఎనిమిదిసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ 86 విదేశీ పర్యటనలకు వెళ్లడం గమనార్హం.

ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనకు మూడుసార్లు వెళ్లగా అమెరికా, దుబాయ్‌లకు రెండేసిసార్లు వెళ్లారు. ఇక దేశాధ్యక్షుడు జరిపిన 8 విదేశీ పర్యటనల్లో 7 పర్యటనలు మాజీ అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ జరిపినవి కాగా చివరి విదేశీ పర్యటన మాత్రం ప్రస్తుత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము వెళ్లారు.

ఇది కూడా చదవండి : Budget 2023: మొట్టమొదటి బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు ? ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నేత ఎవరు ?

ఇది కూడా చదవండి : Budget 2023: అమృత్ కాల్ అంటే ఏంటి ? బడ్జెట్ స్పీచ్‌లో ఆ పదం పదేపదే ఎందుకు ఉపయోగించారు

ఇది కూడా చదవండి : Budget 2023: కేంద్రం ఇచ్చేది 6 శాతం తీసుకునేది 12 శాతం.. ఏంటో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News