సిద్ధిపేటలో కూలిన శిక్షణ విమానం

శుక్రవారం సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. శిక్షణా విమానం గాల్లో చక్కర్లు కొడుతూ ఒక్కసారి జనంపైకి కుప్పకూలింది. శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటనతో జిల్లా యంత్రంగం ఉలిక్కిపడింది.

Last Updated : Nov 24, 2017, 05:19 PM IST
సిద్ధిపేటలో కూలిన శిక్షణ విమానం

సిద్ధిపేట: శుక్రవారం సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. శిక్షణా విమానం గాల్లో చక్కర్లు కొడుతూ ఒక్కసారి జనంపైకి కుప్పకూలింది. శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటనతో జిల్లా యంత్రంగం ఉలిక్కిపడింది. సిద్ధిపేట ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం గమనార్హం. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరూ మృతి చెందలేదు. విమానంలో ఉన్న ముగ్గురు పైలెట్లు పారాచూట్ సహాయంతో కిందకు దిగారు. సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాధమిక దర్యాప్తులో తేలింది. శిక్షణ విమానం హకీంపేట శిక్షణ కేంద్రానికి చెందినదిగా గుర్తించారు.  

పారాచూట్ సహాయంతో కిందకు దిగుతున్న సమయంలో రోహిణి అనే మహిళా పైలెట్ కాలు విరగడంతో.. ఆమెను 108 సిబ్బంది సమీప ఆసుపత్రికి తరలించారు. విమాన శకలాలు కిందపడ్డ వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో విమానం పూర్తిగా దగ్దమైంది. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ఘటనపై అధికారులు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. 

Trending News