IBPS Clerk 2022: నిరుద్యోగులకు శుభవార్త.. 7000లకు పైగా బ్యాంకు ఉద్యోగాలు! జులై 1 నుంచి దరఖాస్తులు

IBPS Clerk Notification 2022 released. బ్యాంకు ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా?.. అయితే మీకు ఓ శుభవార్త. ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  

Written by - P Sampath Kumar | Last Updated : Jun 30, 2022, 09:14 PM IST
  • నిరుద్యోగులకు శుభవార్త
  • 7000లకు పైగా బ్యాంకు ఉద్యోగాలు
  • జులై 1 నుంచి దరఖాస్తులు
IBPS Clerk 2022: నిరుద్యోగులకు శుభవార్త.. 7000లకు పైగా బ్యాంకు ఉద్యోగాలు! జులై 1 నుంచి దరఖాస్తులు

IBPS Clerk 2022 Notification Out: బ్యాంకు ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా?.. అయితే మీకు ఓ శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (ఐబీపీఎస్) క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 7000 క్లర్క్​ పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. గతేడాది ఇదే నోటిఫికేషన్ ద్వారా 7855 క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈసారి 7000లకు పైగా పోస్టులను భర్తీ చేయనుంది. 

ఐబీపీఎస్ కోసం ప్రిపేర్ అయ్యే వారు ప్రాంతీయ భాషల్లోనూరాత పరీక్ష రాసే అవకాశం ఉంది. ఆయా రాష్ట్రాలను బట్టి ఇంగ్లీష్​, హిందీతో పాటు13 ప్రాంతీయ భాషల్లోనూ రాత పరీక్ష రాసుకునే అవకాశం ఉంటుంది. క్లర్క్​ నియామక ప్రక్రియ పూర్తిగా ఆన్​లైన్​ ద్వారా జరగనుంది. ఎంపిక విధానం పూర్తిగా ప్రిలిమ్స్​, మెయిన్స్ పరీక్ష ఫలితాల ఆధారంగా ఉండనుంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూ ఉండదు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉంటేనే ఐబీపీఎస్ రాసేందుకు అర్హులు. కంప్యూటర్ ఆపరేషన్స్ లేదా లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ ఉండాలి. వయస్సు 20 ఏళ్ల నుంచి 28 ఏళ్లు ఉండాలి.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్లో 7000 క్లర్క్​ పోస్టులకు ఖాళీలు ఉంటాయి. కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. జులై 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. రిజర్వేషన్ లేని అభ్యర్థులు (జనరల్​, ఇతరులు) రూ.850.. రిజర్వేషన్​ ఉన్న వాళ్లు (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు) రూ.175 దరఖాస్తు రుసుముగా  చెల్లించాల్సి ఉంటుంది. అప్లై చేయాలంటే ఐబీపీఎస్​ అధికారిక వెబ్​సైట్​లోకి లాగిన్ అవ్వాలి.

ప్రిలిమ్స్​ పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లీష్​లో 30, న్యూమరికల్​ అబిలిటీ 35, రీజనింగ్​ అబిలిటీ 35 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఒక్కో సమాధానానికి ఒక్కో మార్కు ఉంటుంది. పరీక్షకు 60 నిమిషాల ఉంటుంది. ఇందులో అర్హత సాధించినవారికి కటాఫ్​ను బట్టి మెయిన్స్​కు ఎంపిక చేస్తారు. మెయిన్స్​లో మొత్తం 190 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. సమయం 160 నిమిషాలు. దీంట్లో కటాఫ్​ను బట్టి నేరుగా ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల ప్రారంభం: 01-07-2022
దరఖాస్తులకు చివరి తేదీ: 21-07-2022
ప్రి ఎంట్రెన్స్​ టెస్ట్​ కాల్​లెటర్​: 2022 ఆగస్టు
ప్రి ఎంట్రెన్స్​ టెస్ట్ : 2022 ఆగస్టు
ప్రిలిమ్స్​ కాల్​లెటర్​ డౌన్​లోడ్: 2022 ఆగస్టు
ప్రిలిమ్స్​ ఎగ్జామ్​: 2022 సెప్టెంబర్
​ప్రిలిమ్స్​ ఫలితాలు: 2022 సెప్టెంబర్​/అక్టోబర్
​మెయిన్స్​ ఎగ్జామ్ : 2022 అక్టోబర్​
తుది ఫలితాలు: 2023 ఏప్రిల్​

Also Read: రోహిత్ శర్మ ఔట్.. టీమిండియా కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా! బీసీసీఐ అధికారిక ప్రకటన

Also Read: PSLV C53 Launch: నింగిలోకి విజయవంతంగా పీఎస్ఎల్వీ సీ 53 ప్రయోగం, ఇస్రో మరో ఘనత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News