Good News: ఐబీపిఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ 2018 నోటిఫికేషన్ వచ్చేసిందోచ్..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ కోసం వేచిచూస్తున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్

Last Updated : Oct 26, 2018, 10:25 PM IST
Good News: ఐబీపిఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ 2018 నోటిఫికేషన్ వచ్చేసిందోచ్..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ కోసం వేచిచూస్తున్న ఉద్యోగార్థులకు ఓ గుడ్ న్యూస్. బ్యాంకింగ్ రంగంలో ఖాళీలు చేపట్టేందుకు ఐబీపీఎస్ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్) నిర్వహిస్తున్న నియామక పరీక్ష 2018 నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో మొత్తం 1590కిపైగా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులను భర్తీ చేసేందుకు ఐబీపీఎస్ రంగం సిద్ధం చేసుకుంటోంది. 

నోటిఫికేషన్‌కి సంబంధించిన కీలకమైన తేదీల వివరాలిలా ఉన్నాయి.
నవంబర్ 6వ తేదీ నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు నవంబర్ 26వ తేదీ చివరి తేదీ.
డిసెంబర్ 29, 30 తేదీల్లో ప్రిలిమినరి పరీక్ష.
వచ్చే ఏడాది జనవరి 27న మెయిన్స్ పరీక్ష.
ఫిబ్రవరి నెలలో మెయిన్స్ ఫలితాలు వెల్లడించడంతోపాటు అదే నెలలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.

ఈ రెండు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. మొత్తంగా మూడు దశల్లో ఈ నియామక పరీక్ష పూర్తి కానుంది.  

Trending News