75th Independence Day: త్రివర్ణ పతకాన్ని ఎగురవేయడం నుంచి.. ప్రధాని ప్రసంగం వరకు! పూర్తి షెడ్యూల్ ఇదే

Independence Day 2022 Flag Hoisting Timings and PM Modi Schedule. సోమవారం ఉదయం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఢిల్లీలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 15, 2022, 07:28 AM IST
  • త్రివర్ణ పతకాన్ని ఎగురవేయడం నుంచి
  • ప్రధాని ప్రసంగం వరకు
  • పూర్తి షెడ్యూల్ ఇదే
75th Independence Day: త్రివర్ణ పతకాన్ని ఎగురవేయడం నుంచి.. ప్రధాని ప్రసంగం వరకు! పూర్తి షెడ్యూల్ ఇదే

Independence Day 2022 Flag Hoisting Timings and PM Modi Schedule: నేడు భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. సుదీర్ఘ పోరాటం, ఎన్నో బలిదానాల తర్వాత 1947 ఆగస్టు 15న భారతీయులు బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విముక్తి పొందారు. విదేశీ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా స్వాతంత్య్ర అమృతోత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు దేశం మొత్తం సిద్ధమైంది. రాజధాని ఢిల్లీ నుంచి.. మారుమూల గ్రామాల వరకు జెండా పండగకు ముస్తాబయ్యాయి. పతాకావిష్కరణ కార్యక్రమాలకు కోట్లాది మంది ప్రజలు ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నారు. 

సోమవారం ఉదయం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఢిల్లీలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకల కోసం ఎర్రకోటను ముస్తాబు చేశారు. 'ఆజాదీకా అమృత్ మహోత్సవ్' పేరుతో ఈసారి వేడుకలు నిర్వహిస్తోంది భారత ప్రభుత్వం. అలాగే హర్ ఘర్ తిరంగ ప్రచారం ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉంది. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రజలను ప్రోత్సహిస్తుంది. ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి.. జాతి మొత్తాన్ని ఉద్దేశించి ప్రసంగం చేస్తారు.

# సోమవారం (ఆగష్టు 15) ఉదయం 7:06కు మహాత్మా గాంధీ సమాధి అయిన రాజ్‌ఘాట్‌కు ప్రధాని మోదీ చేరుకుంటారు. 
# 7:14 గంటలకు రాజ్‌ఘాట్ నుంచి ప్రధాని ఎర్రకోటకు బయలుదేరుతారు.
# 7:20 గంటలకు ఎర్రకోట వద్ద గౌరవ గార్డ్ నిర్వహిస్తారు.
# 7.30 గంటలకు ఎర్రకోటపై జాతీయ పతాకాన్నిఆవిష్కరిస్తారు. 
# 7.40 గంటలకు జాతి మొత్తాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.
# 9 గంటల తర్వాత దేశ వ్యాప్తంగా జాతీయ జెండాను ఎగురవేసే కార్యక్రమం మొదలవుతుంది. 

వేడుకల ముగింపు సందర్భంగా ఆకాశంలో త్రివర్ణ బెలూన్‌లను ఎగురవేస్తారు. ఆపై ఎట్ హోమ్ రిసెప్షన్‌ను రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేశారు. ఎన్సీసీ స్పెషల్ యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కింద.. 14 వేర్వేరు దేశాల నుంచి 26 మంది అధికారులు, 127 మంది క్యాడెట్లు మొదటిసారిగా ఎర్రకోటలోకి ప్రవేశిస్తారు. ఈసారి అంగన్‌వాడీ కార్యకర్తలు, వీధి వ్యాపారులు, ముద్రా యోజన రుణాలు పొందినవారు, శవాగార కార్యకర్తలకు ప్రత్యేక ఆహ్వానం అందింది.

Also Read: Horoscope Today 15 August 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల ప్రేమికులకు కలిసొచ్చే రోజు!  

Also Read: శృతిక సముద్రాల చేతికి ‘జీ సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్’ టైటిల్.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News